చలో విజయవాడకు తరలిన అంగనవాడీ కార్యకర్తలు
ABN , First Publish Date - 2023-03-20T00:12:52+05:30 IST
చలో విజయవాడ ఆందోళ నకు హిందూపురం అంగనవాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ కా ర్యకర్తలు, ఆయాలు, మినీ అంగనవాడీ కార్యకర్తలు ఆదివారం తరలివెళ్ళారు.

హిందూపురం అర్బన, మార్చి 19: చలో విజయవాడ ఆందోళ నకు హిందూపురం అంగనవాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ కా ర్యకర్తలు, ఆయాలు, మినీ అంగనవాడీ కార్యకర్తలు ఆదివారం తరలివెళ్ళారు. పలు సమస్యలపై సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు విజయవాడ అలంకార్ చౌక్‌లో సోమవారం ధర్నా చేపట్టనున్నా రు. అయితే పోలీసులు కొంతమందికి ముందస్తు నోటీసులు ఇచ్చి, అ డ్డుకునే యత్నంచేశారు. కొందరు నాయకులకు నోటీసులు అందించాలని ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు. వారి ఇళ్లలో కాకుండా బంధువులు,, స్నేహితుల ఇళ్లలో దాక్కుని ఆదివారం మ ధ్యాహ్నం హిందూపురం నుంచి ధర్మవరంకు బస్సులో వెళ్లారు. అ క్కడ కొంతమంది ప్రశాంతి ఎక్స్‌ప్రెస్,. మరికొందరు కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఎక్కి వెళ్ళారు. ఇంకొందరు కార్లలో విజయవాడకు వె ళ్ళారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన తప్పదని వారు హెచ్చరించారు.
‘అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు’
పెనుకొండ: అంగనవాడీలకు సీఎం జగన ఇచ్చిన వాగ్దానాలు అ మలు చేయాలని కోరుతూ సోమవారం పిలుపునిచ్చిన చలో విజయవాడ నిరసన ను భగ్నం చేయడానికి పో లీసులు నోటీసులిచ్చారు. మండలంలోని సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు, అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలకు పోలీసులు ఇం టి వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ నాయకులు రమేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిరి సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో యూనియన అధ్యక్షురాలు బావమ్మ, మాబున్నీసా, నాయకులు పాల్గొన్నారు.