ఇక అర్బన.. రూరల్‌

ABN , First Publish Date - 2023-03-02T00:42:12+05:30 IST

అనంతపురం అర్బన, రూరల్‌ ప్రాంతాలకు వేర్వేరు మండలాలుగా గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం గెజిట్‌ నోటిఫికేషన విడుదల చేసింది. కొన్నేళ్లుగా ఈ ప్రతిపాదన ఉంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొత్త మండలాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు

ఇక అర్బన.. రూరల్‌

రెండు మండలాలుగా అనంత

అనంతపురం రూరల్‌, మార్చి 1: అనంతపురం అర్బన, రూరల్‌ ప్రాంతాలకు వేర్వేరు మండలాలుగా గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం గెజిట్‌ నోటిఫికేషన విడుదల చేసింది. కొన్నేళ్లుగా ఈ ప్రతిపాదన ఉంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొత్త మండలాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా అనంతపురం అర్బన, రూరల్‌ ప్రాంతాలను ప్రత్యేక మండలాలుగా విభజించారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని నోటిఫికేషనలో ప్రభుత్వం కోరింది. ఉగాది నాటికి మండలాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఏ మండలంలో ఏవి..?

అనంతపురం అర్బన:

అనంతపురం కార్పొరేషన పరిధిలోని డివిజన్లు, ఎ.నారాయణపురం, అనంతపురం రూరల్‌, రుద్రంపేట, పాపంపేటలోని కొంత భాగం.

అనంతపురం రూరల్‌:

కొడిమి, తాటిచెర్ల, సోములదొడ్డి, రాచానపల్లి, సజ్జలకాలవ, కురుగుంట, గొల్లపల్లి, కామారుపల్లి, ఆలమూరు, కాటిగానికాలవ, కక్కలపల్లి, పాపంపేట, ఉప్పరపల్లి, ఇటుకలపల్లి, జంగాలపల్లి, కందుకూరు. చియ్యేడు, మన్నిల, కక్కలపల్లి, కక్కలపల్లి కాలనీ.

Updated Date - 2023-03-02T00:42:12+05:30 IST