తనకల్లులో వినతుల వెల్లువ
ABN , First Publish Date - 2023-03-19T00:23:03+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం తనకల్లు మండల కేంద్రంలోనికి చేరుకుంది. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా భారీ సం ఖ్యలో ప్రజలు నిలబడి స్వాగతం పలికారు.

తనకల్లు, మార్చి 18 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం తనకల్లు మండల కేంద్రంలోనికి చేరుకుంది. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా భారీ సం ఖ్యలో ప్రజలు నిలబడి స్వాగతం పలికారు. తనకల్లుకు చెందిన సుశీలమ్మ తనకున్న 32 సెంట్ల భూమిని కబ్జా చేస్తున్నారని, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని నారా లోకేష్‌కు వినతి పత్రం సమర్పించింది. తనకల్లు ఎస్‌సీ కాలనీ వాసు లు తమకు టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలన్నీ రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని వినతి పత్రం అందచేశారు. ఈ విషయాలపైన స్పందించిన లోకేశ వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని, అధికారం చేపట్టిన వెంటనే అన్ని పథకాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దళిత కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గిరిజనుల సమస్యలు లోకేశ దృష్టికి...
గాండ్లపెంట, మార్చి 18: తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో బాగంగా శనివారం తన కల్లు మండలంలోని బొమ్మలకుంటవద్ద గిరిజనులతో ముఖాముఖి నిర్వహిం చారు. గాండ్లపెంట మండలంలోని తుమ్మలబైలు పెద్దతండాకు చెందిన పవనకుమార్‌నాయక్ తమ గ్రామానికి తాగునీరు. సెల్‌ఫోన నెట్‌వర్క్ సమస్య ఉందని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గాజులవారిపల్లి పెద్దతండాకు చెందిన క్రిష్ణనాయక్ మాట్లాడుతూ... తండాలను పంచాయతీలుగా టీడీపీ పాలనలో గుర్తించారని తెలిపారు. తాము ఉపాధి పథకంలో మెట్ట భూముల్లో పండ్లతోటలు సాగుచేశామని, నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి సంరక్షణ బిల్లులు అందలేదన్నారు. తమసమస్య అధికారులకు విన్నవిం చగా... తమ తండాను పంచాయతీగా చేశారు మీతండా ఆనలైనలో లేదని చెబుతున్నారని బాధపడ్డారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే సీఎం తండాకు చెందిన ఆంజినాయక్ మాట్లాడుతూ... బీఈ డీ చేసినా, తాము నిరుద్యోగులుగా ఉన్నామని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. స్పందించిన లోకేష్ తండాల్లో ఉన్న సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు.