ధర్మకర్త కిడ్నా్‌పకు యత్నం
ABN , First Publish Date - 2023-02-21T23:28:42+05:30 IST
పట్టణంలోని గౌరీశంకర ఆలయ ధర్మకర్త వెంకటనాయుడును ఆలయ పూజారి అనిల్, మరికొందరు మంగళవారం కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు
పూజారులే సూత్రధారులు
తాడిపత్రిటౌన, ఫిబ్రవరి 21: పట్టణంలోని గౌరీశంకర ఆలయ ధర్మకర్త వెంకటనాయుడును ఆలయ పూజారి అనిల్, మరికొందరు మంగళవారం కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. బాధితుడు వెంకటనాయుడు తెలిపిన వివరాల మేరకు, యల్లనూరు రోడ్డులోని ద్వారకా విల్లాస్‌లో నివాసం ఉంటున్న వెంకటనాయుడు బ్యాంకులో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆలయ ధర్మకర్తగా ఉంటూ సేవ చేసుకుంటున్నాడు. రోజూ ద్విచక్రవాహనంలో గౌరీశంకర ఆలయానికి వెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఆలయం వద్దకు వెళ్లాడు. శ్రీశైలం వెళ్లేందుకు రూ.5 వేలు కావాలని పూజారి అనిల్ అడగటంతో, తనవద్ద లేవని, ఇంటి వద్దకు వస్తే ఇస్తానని తెలిపాడు. అప్పటికే కారును సిద్ధం చేసుకున్న పూజారి అనిల్.. బైక్ వద్దు కారులో వెళదామని ధర్మకర్తను కోరాడు. దీంతో ఆయన కారులో కూర్చున్నాడు. అదే కారులో కొండేపల్లి ఆలయ పూజారి పవన, మరో పూజారి వీరభద్ర, డ్రైవర్ షబ్బీర్ ఉన్నారు. ధర్మకర్త కూర్చోగానే కారు ఆయన ఇంటికి కాకుండా మరో దారిలో వెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన ధర్మకర్త, ఎక్కడికి వెళుతున్నారని పూజారిని ప్రశ్నించాడు. డీజిల్ పట్టించేందుకు అని బదులు ఇవ్వడంతో వెంకటనాయుడు సరే అన్నాడు. కానీ పెట్రోల్ బంక్ దాటి బుగ్గవైపు కారు వెళ్లడంతో ఆందోళన చెందాడు. ఎక్కడికి తీసుకువెళుతున్నారని ఆయన అడిగినా వారు సమాధానం చెప్పలేదు. ఇదే సమయంలో బుగ్గ వద్ద తాడిపత్రి రూరల్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసులను గమనించిన ధర్మకర్త వెంకటనాయుడు, టీ తాగుదామని పూజారులతో అనడంతో వారు కారును ఆపారు. వెంకటనాయుడు కారుదిగి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. దీంతో భయపడ్డ పూజారి అనిల్ పరారయ్యాడు. మిగిలిన వారు పోలీసుల వద్దకు వెళ్లారు. విచారించిన పోలీసులు, స్టేషనలో ఫిర్యాదు చేయాలని ధర్మకర్తకు సూచించారు. అదే కారులో ఇద్దరు పూజారులతోపాటు ధర్మకర్త పోలీ్‌సస్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.