Share News

రైలు ఢీకొని మహిళ మృతి

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:54 AM

ధర్మవరం, డిసెంబరు 13: పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన దేవరపల్లి వెంకటలక్ష్మి(40) రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొనడంతో మృతి చెందింది. హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఎర్రిస్వామి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

రైలు ఢీకొని మహిళ మృతి

ధర్మవరం, డిసెంబరు 13: పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన దేవరపల్లి వెంకటలక్ష్మి(40) రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొనడంతో మృతి చెందింది. హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఎర్రిస్వామి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరపల్లి వెంకటలక్ష్మి ఆకుకూరల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది. అయితే రోజూ లాగే బుధవారం ఉదయం ఆమె ఆకుకూరలు అమ్ముకోవడానికి వెళుతూ ఇందిరానగర్‌ సమీపంలో రైలు పట్టాలు దాటుతోంది. అయితే రైలు రావడాన్ని గమనించకపోవడంతో అది ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు ఽ రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన ఆదారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త కేశవరెడ్డి ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు క్లీనర్‌గా వెళ్తున్నాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరికి వివాహం చేశారు. అనంతరం మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - Dec 14 , 2023 | 12:54 AM