సమాచారం కోసం రెండే ళ్ల పోరాటం!

ABN , First Publish Date - 2023-09-04T00:19:06+05:30 IST

తనకల్లు, సెప్టెంబరు 3: కొంతమంది అధికారులు సమాచారహక్కు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవ హరిస్తున్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం పొందడానికి తనకు రెం డేళ్ల కాలం పట్టిందని మండలానికి చెందిన న్యాయవాది బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రంకొండ వెంకటరామిరెడ్డి తెలిపారు.

 సమాచారం కోసం  రెండే ళ్ల పోరాటం!

కదిరి మున్సిపాలిటీ పీఐఓకు షోకాజ్‌ నోటీసులు

తనకల్లు, సెప్టెంబరు 3: కొంతమంది అధికారులు సమాచారహక్కు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవ హరిస్తున్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం పొందడానికి తనకు రెం డేళ్ల కాలం పట్టిందని మండలానికి చెందిన న్యాయవాది బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రంకొండ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆర్‌టీఐ ని యమాల ప్రకారం నిర్ణీత కాలంలో సమాచారం ఇవ్వని కదిరి మున్సిపల్‌ పౌర సమాచార అధికారికి రాష్ట్ర సమాచార కమిషన షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేకాధికారుల పాలన సమయంలో చేసిన పనులు, ఖర్చుల వివరాలు తెలియచేయాలంటూ తనకల్లుకు చెందిన న్యాయవాది వెంకటరామిరెడ్డి 2021 మే నెలలో దరఖాస్తు చేశారు. నిర్ణీత కాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో అదే సంవత్సరం జూలైలో మొదటి అప్పీలు చేశారు. అయినా ఆయనకు కావలసిన సమాచారం రాలేదు. ఈ కారణంగా ఆయన రాష్ట్ర సమాచార కమిషనను ఆశ్రయించారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు కావాలంటూ 2022 ఏప్రిల్‌లో రాష్ట్ర సమాచార కమిషన దరఖాస్తుదారుడికి నోటీసు పంపింది. అనంతరం ఈ ఏడాది ఆగస్టు 9న రాష్ట్ర సమాచార కమిషన కార్యాలయంలో ఈ కేసు విచారణ జరిగింది. ఈ అంశంపై విచారణ చేసిన సమాచార కమిషన దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు నిర్ణీత సమయంలో దరఖాస్తు దారుడికి సమాచారం ఇవ్వని అప్పటి పౌర సమాచార అధికారితో పాటు ప్రస్తుత పీఐఓకు షోకాజ్‌ నోటీసులు పంపింది. వారి నుంచి జరిమానా ఎందుకు వసూలు చేయకూడదో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆర్‌టీఐకి దరఖాస్తు చేసుకున్న రెండేళ్ల అనంతరం దరఖాస్తు దారునికి సమాచారం అందించారు. కొంతమంది అధికారులు సమాచారహక్కు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవ హరిస్తున్నారని ఆ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-04T00:19:06+05:30 IST