రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమించాలి

ABN , First Publish Date - 2023-07-18T00:21:54+05:30 IST

మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయానికి రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయ కులు పేర్కొన్నారు.

రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమించాలి

ఉరవకొండ, జూలై 17: మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయానికి రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయ కులు పేర్కొన్నారు. రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమిం చాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. తహసీల్దార్‌ కార్యాలయానికి తలుపులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు రెగ్యులర్‌ తహసీల్దార్‌ ఉంటే వారి అక్రమాలకు అడ్డు అవుతారని నియమించనీయకుండా కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. నియోజక వర్గంలో రాష్ట్ర స్థాయి నాయకులున్నా ఏ ప్రయోజనం లేదన్నారు. అనంతరం డీటీ గురు ప్రసాద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మధుసూదన, రంగారెడ్డి, శీనప్ప, సిద్దప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-07-18T00:21:54+05:30 IST