నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-06-03T00:22:55+05:30 IST
అమరాపురం మండలం కొర్రేవు గొల్లహట్టి గ్రామానికి చెందిన మంజునాథ్ (35) శుక్రవారం నీటి కుంటలోకి జారిపడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మడకశిర టౌన(అమరాపురం) జూన 2: అమరాపురం మండలం కొర్రేవు గొల్లహట్టి గ్రామానికి చెందిన మంజునాథ్ (35) శుక్రవారం నీటి కుంటలోకి జారిపడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొర్రేవు గ్రామానికి చెందని వీరన్న కుమారుడు మంజునాథ్ నిద్రగట్ట గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచేసేవాడన్నారు. గొర్రెలను ఉదయం నిద్రగట్ట చెరువు వద్దకు తీసుకెళ్లాడు. వాటిని నీటిలో వదిలి పర్య వేక్షిస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువు లో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. సమీ పంలో ఉన్నవారు గమనించి బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. భార్య పవిత్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.