ఘనంగా సీతారాముల విగ్రహాల ఊరేగింపు
ABN , First Publish Date - 2023-12-11T00:00:36+05:30 IST
పట్టణంలో ఆదివారం సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ, వాల్మీకి విగ్రహాలను ఘనం ఊరే గించారు. పట్టణంలోని సూరప్ప కట్ట వాల్మీకి వీధిలో ఉన్న రామభజన మందిరంలో ప్రతిష్ఠించేందుకు తీసుకొచ్చారు.
హిందూపురం అర్బన, డిసెంబరు 10: పట్టణంలో ఆదివారం సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ, వాల్మీకి విగ్రహాలను ఘనం ఊరే గించారు. పట్టణంలోని సూరప్ప కట్ట వాల్మీకి వీధిలో ఉన్న రామభజన మందిరంలో ప్రతిష్ఠించేందుకు తీసుకొచ్చారు. దాత వైఎనబీ భాస్కర్ సహకారంతో రూ.2 లక్షలు విలువ చేసే విగ్రహాలను కర్ణాటకలో తయా రు చేయించి ఆదివారం రాత్రి హిందూపురం తీసుకొచ్చారు. వాటిని సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ట్రాక్టర్‌లో ఉంచి ఊరేగింపుగా మందిరానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం పెద్దలు బీఎన మూర్తి, రామకృష్ణ, నరసింహమూర్తి, బీఎన నాగరాజు, డీఈ రమేష్‌కుమార్, వైటీపీ రవి, అశోక్, విజయ్, బిజెపి రమేష్‌రెడ్డి, మంజు, నటేష్, గణేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.