అధినేత విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష

ABN , First Publish Date - 2023-09-26T00:03:33+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ నుంచి బయటకు వచ్చేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావంగా సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు సవిత పూనుకున్నారు.

అధినేత విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష
ఎన్టీఆర్‌ విగ్రహం నిరసన తెలుపుతున్న సవిత, టీడీపీ నాయకులు

- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ టౌన, సెప్టెంబరు 25: టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ నుంచి బయటకు వచ్చేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావంగా సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు సవిత పూనుకున్నారు. ఈ క్రమంలో ఆమె కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆమె కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో దీక్షలో కూర్చొన్నారు. సవితమ్మకు మద్దతుగా సీపీఎం, స్థానిక నాయకులు ఆమెకు పూల మాలలు వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇంటి గడప తొక్కినా సీఎం జగన ఒక సైకో అంటున్నారని, మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతీది అమ్మకానికి పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబునాయుడేనని, ఈ రంగానికి చంద్రబాబే అంబాసిడర్‌ అన్నారు. మా నాయకుడుని జైల్లో పెడితే ఇక ఎదురు ఉండదని సీఎం భావిస్తున్నారని, ఆయన జైల్లో ఉండటం వల్ల ఎంతో సానుభూతి వస్తోందన్నారు. కార్యక్రమంలో ఎగువింటి సోమశేఖర్‌, మాఽధవ నాయుడు, గుట్టూరు సూరి, రొద్దం చంద్రమౌళి, మాజీ జడ్పీటీసీలు శ్రీనివాసులు, వెంకటరమణ, శాసనకోట వెంకటేష్‌, దాదు, త్రివేంద్ర, వాసుదేవరెడ్డి, సీపీఐ శ్రీరాములు, జనసేన నాయకులు మహేష్‌, రాజేష్‌, రామాంజి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:03:33+05:30 IST