క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ABN , First Publish Date - 2023-11-19T23:42:09+05:30 IST
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఖో-ఖో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి అన్నారు.

ఉరవకొండ, నవంబరు 19: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఖో-ఖో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఖో-ఖో జూనియర్, సబ్‌జూనియర్ బాలురు, బాలికల జట్ల ఎంపికకు పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో నరసరావుపేట, మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మారుతి, రాము, ప్రభాకర్, నాగరాజు పాల్గొన్నారు.