64కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:08 AM
స్థానిక రైల్వే స్టేషనలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ.8.96 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ సీఐ నగేశబాబు శనివారం అరెస్టు వివరాలను వెల్లడించారు. రైళ్ల ద్వారా మత్తుపదార్థాల రవాణాను అడ్డుకోవడం కోసం స్టేషనలో ప్లాట్‌ఫాం- 7లో తనిఖీలు నిర్వహించామన్నారు.
గుంతకల్లు రైల్వే స్టేషనలో పట్టుబడిన మత్తుపదార్థం
విలువ రూ. 8.96 లక్షలుగా అంచనా
గుంతకల్లు, డిసెంబరు 16: స్థానిక రైల్వే స్టేషనలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ.8.96 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ సీఐ నగేశబాబు శనివారం అరెస్టు వివరాలను వెల్లడించారు. రైళ్ల ద్వారా మత్తుపదార్థాల రవాణాను అడ్డుకోవడం కోసం స్టేషనలో ప్లాట్‌ఫాం- 7లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించార న్నారు. వారిని ప్రశ్నించడానికి వెళ్లగా ఓ వ్యక్తి పరారయ్యాడని, ఇంకో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీచేయగా అందులో గంజాయి బయటపడిందన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒడిశా రాష్ట్రం, రాయ్‌పల్లి గ్రామానికి చెందిన శుభరాం ప్రధాన అని తెలిపారు. అతడిని విచారించగా పరారైన వ్యక్తి పేరు ప్రఫుల్ అని అతడు గంజాయిని రవాణా చేయడానికి రూ. 15 వేలు చెల్లిస్తానని తనతో ఒప్పందం కుదుర్చుకున్నాడని వివరించాడన్నారు. ఒడిశా నుంచి గుంతకల్లు మీదుగా గోవాకు గంజాయిని తీసుకెళ్తూ దొరికిపోయారన్నారు. స్వాధీనమైన గంజాయి 64 కేజీలు ఉందని, దాని విలువ రూ. 8.96 లక్షలని సీఐ వివరించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రఫుల్‌ను త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్‌ఐ మహేంద్ర, హెడ్ కానిస్టేబుల్ సర్వేశ్వరరామ, సిబ్బంది గాదిలింగ, ప్రకాశ, అలీ, నబీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ఎం వీరేశ, జే సూరి నాయుడు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
64కిలోల గంజాయి స్వాధీనం
గుంతకల్లు రైల్వే స్టేషనలో పట్టుబడిన మత్తుపదార్థం
విలువ రూ. 8.96 లక్షలుగా అంచనా
గుంతకల్లు, డిసెంబరు 16: స్థానిక రైల్వే స్టేషనలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ.8.96 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ సీఐ నగేశబాబు శనివారం అరెస్టు వివరాలను వెల్లడించారు. రైళ్ల ద్వారా మత్తుపదార్థాల రవాణాను అడ్డుకోవడం కోసం స్టేషనలో ప్లాట్‌ఫాం- 7లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించార న్నారు. వారిని ప్రశ్నించడానికి వెళ్లగా ఓ వ్యక్తి పరారయ్యాడని, ఇంకో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీచేయగా అందులో గంజాయి బయటపడిందన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒడిశా రాష్ట్రం, రాయ్‌పల్లి గ్రామానికి చెందిన శుభరాం ప్రధాన అని తెలిపారు. అతడిని విచారించగా పరారైన వ్యక్తి పేరు ప్రఫుల్ అని అతడు గంజాయిని రవాణా చేయడానికి రూ. 15 వేలు చెల్లిస్తానని తనతో ఒప్పందం కుదుర్చుకున్నాడని వివరించాడన్నారు. ఒడిశా నుంచి గుంతకల్లు మీదుగా గోవాకు గంజాయిని తీసుకెళ్తూ దొరికిపోయారన్నారు. స్వాధీనమైన గంజాయి 64 కేజీలు ఉందని, దాని విలువ రూ. 8.96 లక్షలని సీఐ వివరించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రఫుల్‌ను త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్‌ఐ మహేంద్ర, హెడ్ కానిస్టేబుల్ సర్వేశ్వరరామ, సిబ్బంది గాదిలింగ, ప్రకాశ, అలీ, నబీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ఎం వీరేశ, జే సూరి నాయుడు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టుబడిన నిందితుడు, గంజాయితో రైల్వే పోలీసులు