టీ-ఎంసెట్‌లో తాడిపత్రి విద్యార్థికి 5వ ర్యాంకు

ABN , First Publish Date - 2023-05-26T00:52:50+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో తాడిపత్రి విద్యార్థి ప్రమోద్‌కుమార్‌రెడ్డికి 5వ ర్యాంకు వచ్చింది. 160 మార్కులకు గాను ప్రమోద్‌ 156 మార్కులు సాధించారు. ప్రమోద్‌ తండ్రి శ్రీనివాసులురెడ్డి పెద్దపప్పూరు జడ్పీ హై స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు

టీ-ఎంసెట్‌లో తాడిపత్రి విద్యార్థికి 5వ ర్యాంకు
ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి (ఫైల్‌)

తాడిపత్రి, మే 25: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో తాడిపత్రి విద్యార్థి ప్రమోద్‌కుమార్‌రెడ్డికి 5వ ర్యాంకు వచ్చింది. 160 మార్కులకు గాను ప్రమోద్‌ 156 మార్కులు సాధించారు. ప్రమోద్‌ తండ్రి శ్రీనివాసులురెడ్డి పెద్దపప్పూరు జడ్పీ హై స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లి అన్నపూర్ణ గృహిణి. తాడిపత్రి పట్టణంలోని వివిధ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన ప్రమోద్‌, ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చదివాడు. ఇంటర్‌లో 1000/985 మార్కులు సాధించాడు. ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయినలో 97వ ర్యాంకును సాధించాడు. ముంబై ఐఐటీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స చదవాలన్నదే తన లక్ష్యమని ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-26T00:52:50+05:30 IST