బీటెక్‌లో 25శాతం సీట్లు ఖాళీ..!

ABN , First Publish Date - 2023-09-26T00:06:25+05:30 IST

బీటెక్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశాల్లో 2023 విద్యా సంవత్సరంలో 25 శాతం సీట్లు ఖాళీగా మిగిలి పోయాయి. జేఎనటీయూ పరిధిలో ఐదు ఉమ్మడి జిల్లాల్లో మూడు కానస్టిట్యూయేట్‌, 72 అనుబంధ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలున్నాయి. మడకశిర అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలతో కలిపి మొత్తం 77 కళాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్‌ కోటా కింద 35508 సీట్లు కేటాయించింది.

బీటెక్‌లో 25శాతం సీట్లు ఖాళీ..!

అనంతపురం సెంట్రల్‌, సెప్టెంబరు 25: బీటెక్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశాల్లో 2023 విద్యా సంవత్సరంలో 25 శాతం సీట్లు ఖాళీగా మిగిలి పోయాయి. జేఎనటీయూ పరిధిలో ఐదు ఉమ్మడి జిల్లాల్లో మూడు కానస్టిట్యూయేట్‌, 72 అనుబంధ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలున్నాయి. మడకశిర అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలతో కలిపి మొత్తం 77 కళాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్‌ కోటా కింద 35508 సీట్లు కేటాయించింది. వీటిలో ప్రవేశాలను కల్పించేందుకు జేఎనటీయూ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తాధ్వర్యంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ(ఈఏపీ) సెట్‌-2023ను నిర్వహించింది. ఫలితాల అనంతరం ఆనలైన ద్వారా రెండు విడతల వారిగా ఎంపీసీ స్ర్టీమ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించగా మొదటి విడత 19317, రెండవ విడత 7381 మొత్తం 26698 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో 75.19 శాతం సీట్లు భర్తీకాగా 24.81 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.

ఈసీఈ వర్సెస్‌ సీఎ్‌సఈ...

బీటెక్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశాల్లో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన ఇంజనీరింగ్‌(ఈసీఈ) వర్సెస్‌ కంప్యూటర్‌ సైన్స ఇంజనీరింగ్‌(సీఎ్‌సఈ)గా మారింది. మొత్తం 31 కోర్సులకు గాను మొత్తం 35508 సీట్లలో ఈసీఈ 8229, సీఎ్‌సఈ 9954 కేటాయించారు. ఇందులో ఈసీఈ 6395మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది 77.71శాతం భర్తీ అయ్యాయి. అదేవిధంగా సీఎ్‌సఈలో 8607 సీట్ల భర్తీతో 86.47శాతం మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స అండ్‌ డిజైన, నెట్‌వర్క్స్‌, ఇనఫర్మేషన టెక్నాలజీ, ఐఓటీ అండ్‌ బ్లాక్‌చైన, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, అటోమేషన వంటి కోర్సులు వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా అగ్రికల్చర్‌, బయో మెడికల్‌, ఫుడ్‌ టెక్నాలజీ, మెకానికల్‌, సివిల్‌ తదితర ఇంజనీరింగ్‌ కోర్సులు భర్తీ శాతం 40కి దాటలేదు.

ముగిసిన ప్రవేశాల ప్రక్రియ...

ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రవేశాలకోసం నిర్వహించిన ద్వితీయ కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గతనెలాఖరు నుంచి తరగతులు ప్రారంభించారు. రెండవ విడత విద్యార్థులు మంగళవారం నుంచి కళాశాలలకు హాజరు కానున్నారు. ఫార్మసీ ప్రవేశాలకోసం బైపీసీ స్ర్టీమింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సివుంది.

Updated Date - 2023-09-26T00:06:25+05:30 IST