కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2023-05-31T23:58:10+05:30 IST

మండలంలోని నారప్పగారిపల్లిలో బుధ వారం తెల్లవారు జామున కుక్కలదాడిలో గ్రామానికి చెందిన మల్లప్ప, అతడి అల్లుడు చంద్రాకు చెందిన 20గొర్రెలు మృతిచెం దాయి.

కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి

ఓబుళదేవరచెరువు, మే 31: మండలంలోని నారప్పగారిపల్లిలో బుధ వారం తెల్లవారు జామున కుక్కలదాడిలో గ్రామానికి చెందిన మల్లప్ప, అతడి అల్లుడు చంద్రాకు చెందిన 20గొర్రెలు మృతిచెం దాయి. మరో పది తీవ్రం గా గాయపడ్డాయి. బాధి తులు తెలిపిన మేరకు... మంగళవారం రాత్రి గాలి, వాన కురవడంతో వారు గొర్రెల మంద వద్ద కాకుం డా ఇంటికెళ్లి పడు కున్నారు. బుధవారం తెల్లవారు జామున వీధి కుక్కలు గొర్రెల మందలోకి చొరబడి గొర్రెలపై దాడిచేయగా 20 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందాయి. మరో పది తీవ్రంగా గాయపడ్డాయి. ఉదయం నిద్రలేవగానే గొర్రెల మంద వద్ద కెళ్లి చూసిన వారికి ఈ దృశ్యం కనిపించిఒంది. గొర్రెల మృతితో దాదాపు రూ. 3లక్షలు నష్టం జరిగిందని వారు కంటతడిపెట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. పశువైద్యాధికారి ప్రవీణ్‌ కుమార్‌ సంఘటనాస్థలానికి వెళ్లి గొర్రెల కళేబరాలకు పోస్టమార్టం నిర్వహించారు. విషయం తెలుసుకు న్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోనద్వారా బాధితుడు మల్లప్పను పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆధైర్యపడవద్దని, టీడీపీ తరుపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే టీడీజీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, స్థానిక సర్పంచ రెడ్డిపల్లి శంకర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకు లు నిజాం, మీసేవా సుధాకర్‌, ఎంపీటీసీ శ్రీనివాసులు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. సామకోటి ఆదినారాయణ, శంకర్‌రెడ్డి రూ. 5వేలు చొప్పున తమ వంతుగా బాధితులకు అందజేశారు. పుట్టపర్తి నుంచి సొంత ఖర్చుల తో వాహనాన్ని పంపి, కుక్కలను పుట్టపర్తిలోని స్వచ్ఛంద సంస్థకు అప్పగి స్తామని సోమకోటి ఆదినారాయణ హామీ ఇచ్చారు. పరామర్శించినవారిలో టీడీపీ నాయకులు బూదిలి ఓబులరెడ్డి, ఆటో రామాంజి, షబ్బీర్‌, శీనా, పురుషోత్తమ్‌, బాలిరెడ్డి, రవీంద్ర, శ్రీనివాసులు, రఘునాథ్‌రెడ్డి, ఎం శ్రీనివాసులు తదితరులున్నారు.

Updated Date - 2023-05-31T23:58:10+05:30 IST