TTD: తిరుమల ఘాట్‌లో ప్రమాదాలు నివారిద్దాం

ABN , First Publish Date - 2023-06-02T20:20:40+05:30 IST

తిరుమల ఘాట్‌లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అధికారులను ఆదేశించారు.

TTD: తిరుమల ఘాట్‌లో ప్రమాదాలు నివారిద్దాం

తిరుమల: తిరుమల ఘాట్‌లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా..

మొదటి ఘాట్‌(డౌన్‌)లో 1మలుపు, 7వ మైలు, అలిపిరి డౌన్‌ గేట్‌, లింక్‌రోడ్డు, సహజసిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడాకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్‌పాయింట్స్‌ ఏర్పాటు

అప్‌ఘాట్‌ తరహాలో డౌన్‌ ఘాట్‌లో కూడా కాంక్రీట్‌ రీటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం

ఏ రకమైన వాహనాలను ఘాట్‌లో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు విరివిగా ఏర్పాటు

ఘాట్‌లో స్పీడ్‌ లిమిట్‌ ఎంత, డ్రైవింగ్‌ చేసేటప్పుడు మొబైల్‌ వినియోగం నిషేధం, తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను తెలిపేలా నిరంతరం కరపత్రాలు పంపిణీ

ఘాట్‌లో వాహనాల వేగాన్ని గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు

అంబులెన్స్‌లు, రెస్క్యూ బృందాలు అవసరమైన పరికరాలతో సదా సన్నద్ధంగా ఉంచాలి

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలి

ఘాట్‌లో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఓవర్‌టేక్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలి

ఘాట్‌లో ప్రమాదాలు జరిగిన తక్షణమే రుయాతో పాటు స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి.

Updated Date - 2023-06-02T20:20:40+05:30 IST