Share News

AP NEWS: ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం.. నా చావుకు సీఎం జగనే కారణంటూ లేఖ

ABN , First Publish Date - 2023-12-10T18:23:47+05:30 IST

సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉపాధ్యాయుడు మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

AP NEWS: ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం.. నా చావుకు సీఎం జగనే కారణంటూ లేఖ

అనంతపురం: సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉపాధ్యాయుడు మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు సీఎం జగనే కారణమని బాధితుడు లేఖ రాశారు.

5 పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో టీచర్ మల్లేశ్ పోస్టు చేశారు. సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, 5వ తేదీ కల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో ఉపాధ్యాయుడు మల్లేశ్ వెల్లడించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ఉపాధ్యాయులు చేరుకుంటున్నారు.


MALLESH.jpg


MPP.jpg

Updated Date - 2023-12-10T18:49:44+05:30 IST