మందు బాటిల్ సురేఖ ముద్దుల వర్షం

ABN, First Publish Date - 2022-12-10T20:03:05+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖావాణి నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖావాణి నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆన్ స్క్రీన్ చీరకట్టులో నుదుడిన పెద్దబొట్టుతో ఎంతో హోమ్లిగా కనిపించే సురేఖావాణి ఆఫ్ స్క్రీన్ మాత్రం ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటోంది. సినిమాలతో బిజిగా ఉంటూనే కుతూరు సుప్రితతో కలిసి విదేశీ టూర్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటోంది. ఆ ఎంజాయ్ మెంట్ అంతా సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు తల్లీకూతుర్లు. ఇటీవలే తల్లికూతుర్లు దుబాయ్ పర్యటనకు వెళ్లి వచ్చారు. తాజాగా బ్యాంకాక్‌లో ప్రత్యక్షమయ్యారు. సురేఖావాణి పుట్టిన రోజు ఉండడంతో తల్లీకూతుర్లు ఇద్దరూ బ్యాంకాక్‌లో సందడి చేశారు. బ్యాంకాక్‌లో తమ హోటల్ రూమ్ బాల్కానీలో కేక్ కటింగ్ చేసి మందు తాగుతూ ఎంజాయ్ చేశారు. కూతురు సుప్రిత తన తల్లీ సురేఖకు దగ్గర ఉండి తాగించడం విశేషం. సురేఖావాణి పుట్టినరోజుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated at - 2022-12-13T00:08:27+05:30