ఆన్ లైన్ గేమ్ ఆడిన యువకుడు.. 95 లక్షలు మాయం
ABN, First Publish Date - 2022-12-21T19:28:15+05:30 IST
న్‌లైన్ గేమ్ యాప్స్ నిండా ముంచుతున్నాయి. అకౌంట్లను ఖాళీ చేస్తున్నాయి. కింగ్ 527 ఆన్‌లైన్ గేమ్ ఆడి ఓ యువకుడు రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఆన్‌లైన్ గేమ్ యాప్స్ నిండా ముంచుతున్నాయి. అకౌంట్లను ఖాళీ చేస్తున్నాయి. కింగ్ 527 ఆన్‌లైన్ గేమ్ ఆడి ఓ యువకుడు రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమి పరిహారం డబ్బులను తల్లిదండ్రులు కొడుకు అకౌంట్‌లో దాచిపెట్టారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న హర్షవర్దన్ రెడ్డి కింగ్ 527 ఆన్‌లైన్ గేమ్ ఆడి అకౌంట్‌లోని రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారామపూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డిది భూనిర్వాసిత కుటుంబం. గేమ్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తమ డబ్బు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
Updated at - 2022-12-21T19:57:03+05:30