TS News: వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసే అవకాశం?

ABN , First Publish Date - 2022-11-28T12:10:40+05:30 IST

వరంగల్ జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేస్తున్న పాదయాత్ర (Padayatra)లో పోలీసులు భారీగా మోహరించారు.

TS News: వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసే అవకాశం?

వరంగల్ జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేస్తున్న పాదయాత్ర (Padayatra)లో పోలీసులు భారీగా మోహరించారు. ఆమెను ఏక్షణమైనా అరెస్ట్ (Arrest) చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. షర్మిల పాదయాత్రలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. నిన్న (ఆదివారం) నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy)పై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కాగా షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల పాదయాత్ర మార్గంలో టీఆర్ఎస్ మహిళలు కలుస్తున్నారు.

Updated Date - 2022-11-28T12:10:47+05:30 IST