మాతా శిశు సంరక్షణే లక్ష్యం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-11-27T00:48:27+05:30 IST

మాతా శిశు సంరక్షణ లక్ష్యంగా సీఎం కోట్లాది రూపాయలతో అధునాతన వైద్య పరికరాలు, మౌలిక వసతులతోపాటుగా వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శనివారం నగరలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో హైదరాబాద్‌ పేట్లబురుజు ఆస్పత్రి నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 56 అధునాతన టిఫా స్కానింగ్‌(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనోమలీస్‌) యంత్రాలను ప్రారంభించారు.

మాతా శిశు సంరక్షణే లక్ష్యం : ఎమ్మెల్యే
టిఫా స్కానింగ్‌ యంత్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో టిఫా స్కానింగ్‌ మిషన్లు ప్రారంభం

వరంగల్‌, నవంబరు 26 : మాతా శిశు సంరక్షణ లక్ష్యంగా సీఎం కోట్లాది రూపాయలతో అధునాతన వైద్య పరికరాలు, మౌలిక వసతులతోపాటుగా వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శనివారం నగరలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో హైదరాబాద్‌ పేట్లబురుజు ఆస్పత్రి నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 56 అధునాతన టిఫా స్కానింగ్‌(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనోమలీస్‌) యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో రూ.60 లక్షలలో ఏర్పాటు చేసిన రెండు అధునాతన టిఫా(గర్భంలోని పిండం ఎదుగుదల, లోపాలను పరీక్షించే) స్కానింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో గర్భిణులు వస్తుండడంతో ప్రస్తుతం ఉన్న టిఫా స్కానింగ్‌కు అదనంగా మరో రెండు ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకుపోయి మంజూరు చేయించినందుకు సీఎంతో పాటు, మంత్రి హరీష్‌రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు.

ప్రయివేటు ఆస్పత్రిలో రూ.3వేలు వ్యయం అయ్యే టిఫా స్కానింగ్‌ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారని, గర్భిణులు ఈ సద్వినియోగంచేసుకోవాలని కోరారు. తాను ఈ ఆస్పత్రిలో పుట్టానని, అందుకే సీఎం సహకారంతో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. టిఫా స్కానింగ్‌ పనితీరును రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ రాంబాబు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకరమణ, సూపరింటిండెంట్‌ డాక్టర్‌ వై.పద్మ, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్యాం కుమార్‌, కార్పొరేటర్‌ గందె కల్పన, టీఆర్‌ఎస్‌ నాయకులు చింతాకుల సునీల్‌, గందె నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T00:48:29+05:30 IST