బీఆర్‌ఎస్‌కు మూకుమ్మడిగా రాజీనామా
ABN , First Publish Date - 2022-12-16T23:35:21+05:30 IST
గ్రామంలో అభివృద్ధి జరగడం లేదంటూ గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) నాయకులు మూకుమ్మడి రాజీనా
గుండ్లపహాడ్‌లో వందమంది ప్రకటన
గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌తోపాటు ఎమ్మెల్యే విఫలమైనట్టు ఆరోపణ
నల్లబెల్లి, డిసెంబరు 16: గ్రామంలో అభివృద్ధి జరగడం లేదంటూ గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) నాయకులు మూకుమ్మడి రాజీనా మా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కి చెందిన ఆయా వాట్సప్ గ్రూపుల్లో రాజీనామా విషయా న్ని పోస్టు చేశారు.
ఈ విషయమై గుండ్లపహాడ్ బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు బైరుపాక సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తు త సర్పంచ్ కడ్డూరి కటయ్య(కాంగ్రె్‌స్) నిధులు వచ్చినా అభివృద్ధి పనులు చేపట్టడం లేదంటూ విమర్శించారు. ఈ విషయమై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు ఎంపీపీ, జడ్పీటీసీ, డీఎల్‌పీవో, ఎంపీవో కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్ర భుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే సీసీ రో డ్లు వేయిస్తామని ఇచ్చారని, ఇప్పటి వరకు అమలు కాలే దన్నారు. గ్రామం నుంచి మేడపల్లికి రోడ్డు కలగానే మారిం దని మండిపడ్డారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం.. సర్పం చ్ నిర్లక్ష్యంగా కారణంగా మనస్థాపం చెంది పార్టీకి మూకు మ్మడి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. తమ రాజీనామా తోనైనా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే తోపాటు, ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీకి గ్రామ అధ్యక్షుడు బైరుపాక సుధాకర్‌తోపాటు నాయకులు భగీర థరావు, పడాల అనిల్, కూస ఆదిరెడ్డి, రమేష్, శ్రీధర్, మో హన్, వెంకన్న, కొమరవెల్లి, యాదగిరి, సూరయ్య, రాజిరెడ్డి, ఓదెలు, రాజకొమురయ్య, మల్లయ్య, కూస సుగుణలింగా రెడ్డి, అక్బర్, మనొద్దీన్, రవీందర్‌లతోపాటు వంద మంది కా ర్యకర్తలు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామాభి వృద్ధి కోసం రాజీనామా చేయడం గ్రామంలో చర్చనీయాం శమైంది.