ఉత్పత్తి ఇక్కడ... ఆదాయం అక్కడ..
ABN , First Publish Date - 2022-12-16T00:29:07+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన ఎక్సైజ్‌శాఖ తర్వాత స్థానంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలో జిల్లాల వారీగా ఆదాయ పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
తరలుతున్న గ్రానైట్ రాయల్టీ
పరిశ్రమలు లేక జిల్లా కోల్పోతున్న రాబడి రూ.9.5కోట్లు
ఏటా రావాల్సింది రూ.48కోట్లు... వసూలవుతున్నది రూ.16కోట్లు
ప్రతిపాదనల్లోనే నిలిచిన గ్రానైట్ ఇండస్ట్రియల్ పార్కు
ఉమ్మడి రాష్ట్రంలోనే నాణ్యమైన బ్లాక్ గ్రానైట్ నిల్వలు
మహబూబాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన ఎక్సైజ్‌శాఖ తర్వాత స్థానంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలో జిల్లాల వారీగా ఆదాయ పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే నాణ్యమైన బ్లాక్ గ్రానైట్ ఖనిజం జిల్లాలో ఉత్పత్తి అవుతున్నా... ఖనిజాల తవ్వకాలు, రవాణాపై రాయల్టీ రూపంలో వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం పొరుగు జిల్లాకు వెళ్లడం గమనార్హం. రాష్ట్ర గ్రానైట్ ఆదాయంలో హెచ్చుతగ్గులేమీ లేకున్నప్పటికీ జిల్లాల వారీగా సమకూరే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ) ఆదాయం మాత్రం పరిశ్రమలు లేక పావు వంతుకు పడి పోతోంది. జిల్లాలో ఉన్న గ్రానైట్ క్వారీలకనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలను స్థాపించాలని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ఇవి ప్రతిపాదనల స్థాయిలోనే నిలిచి పోయాయి. ఆరేళ్లు గడుస్తున్నా జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల జాడే లేదు. ఫలితంగా జిల్లాకు మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు పన్ను రూపంలో ఏటా వచ్చే ముప్పావువంతు రూ.9.5కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. డీఎంఎఫ్టీతో జిల్లాలోని గ్రానైట్ క్వారీలతో ప్రభావితమయ్యే గ్రామాల అభివృద్ధి జరగనుంది. ఫ్యాక్టరీలతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
1700 ఎకరాల్లో క్వారీలు
జిల్లాలో వివిధ రకాల ఖనిజాలు ఉత్పత్తి అయ్యే క్వారీలు 1759 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వివిధ రకాల ఖనిజ పరిశ్రమలపై ఏటా రూ.16 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. వీటిలో ఖనిజ రకాల ఆధారంగా 10 నుంచి 30శాతం వరకు జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ)కి 2016 నుంచి జమ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 1759 ఎకరాల విస్తీర్ణంలో చిన్న తరహా ఖనిజ పరిశ్రమైన 2 డోలమైట్ అండ్ బైరటీస్, 1 డోలమైన్, 4 బైరెటీస్, 1 క్వార్డ్, 168 బ్లాక్ గ్రానైట్, 2 కలర్ గ్రానైట్, 19 స్టోన్, మెటల్ క్వారీలు వెరసి 197 ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ కేసముద్రం, డోర్నకల్, నెల్లికుదురు, కురవి, గూడూరు, మరిపెడ, తొర్రూరు, గార్ల, బయ్యారం మండలాల్లో ఏర్పాటై ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా బ్లాక్ గ్రానైట్ 27లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వలు, 600లక్షల టన్నుల ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ అంచనా వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే నాణ్యమైన బ్లాక్ గ్రానైట్ లభించే క్వారీలు జిల్లాలో ఉండడం విశేషం.
మూడేళ్లలో ఆదాయం ఇలా..
గ్రానైట్, ఇతర ఖనిజాల నుంచి జిల్లా ఆవిర్భవించిన ఏడాది 2016-17 సంవత్సరానికి రూ.26.14కోట్ల ఆదాయాన్ని వసూలు చేయాలని భూగర్భ గనుల శాఖ లక్ష్యం నిర్ణయించగా నిర్ధేశించిన లక్ష్యంలో 36ు రూ.9.49కోట్లు వసూలయ్యాయి. 2017-18లో రూ.21.55కోట్లు లక్ష్యం కాగా రూ.16.63కోట్లు (77ు), 2018-19లో రూ.22.54కోట్లు లక్ష్యం కాగా రూ.16.87కోట్లు (75ు), 2019-20లో రూ.22.34కోట్లు లక్షం కాగా రూ.16.87కోట్లు (75ు) వసూలయ్యాయి. 2020-21లో కరోనా కారణంగా ఆదాయంలో ఎలాంటి లక్ష్యం నిర్ధేశించపోయినప్పటికీ రూ.16.63కోట్లు, 2021-22లో అక్టోబర్ నెల వరకు రూ.8.16కోట్లు వసూలై రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖకు జమ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గనుల చట్టాన్ని అనుసరించి ఖనిజాల తవ్వకాల మూలంగా ప్రభావితమయ్యే ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమం కోసం జిల్లాల వారీ గా జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ)లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అయితే ఇతర ప్రాంతాలకు కూడా ఈ నిధుల్లోంచి కేటాయింపులు జరుగు తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రానైట్ పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే రాతిదిమ్మెలు (బ్లాక్) పరిమాణం ఆధారంగా రూ.2300, రూ.3000 రెండు, మూడు శ్లాబ్లుగా ప్రభుత్వానికి యాజమాన్యం రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ఈ రాయల్టీపై 20శాతం డీఎంఎఫ్‌టీకి కట్టాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారా నేరుగా క్వారీల యాజమాన్యమే విభజించి అటు ప్రభుత్వానికి ఇటు జిల్లా ట్రస్ట్‌కు జమ చేస్తున్నారు.
పరిశ్రమలు లేక ఇతర జిల్లాకు ఆదాయం
జిల్లాలో గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు లేకపోవడంతో ఆదాయం అంతా పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాకు తరలిపోతోంది. ఖమ్మం జిల్లాలో పెద్ద సంఖ్యలో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు ఉండడంతో అక్కడి ఫ్యాక్టరీలు రాయిని మహబూబాబాద్ జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయల్టీ చెల్లింపులో ఫ్యాక్టరీలకు రాయితీ ఇస్తోంది. 270 సెంటీమీటర్ల పొడవు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న గ్రానైట్ రాయికి ఘనపు మీటరుకు రూ.2300, అంతకంటే ఎక్కువ పరిమాణంలోని రాయికి ఘనపు మీటరుకు రూ.3000 చొప్పున ప్రభుత్వానికి గ్రానైట్ క్వారీ చెల్లించాల్సి ఉంది. ఇదే రాయిని ఫ్యాక్టరీ కోత కోసం క్వారీ నుంచి దిగుమతి చేసుకుంటే ఘనపు మీటరుకు కేవలం రూ.వెయ్యి రాయల్టీ చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని క్వారీల్లో ఉత్పత్తి జరిగే గ్రానైట్ రాయికి క్వారీలు అధిక రాయల్టీ చెల్లించకుండా ఖమ్మం జిల్లాలోని కటింగ్ ప్యాక్టరీలే ప్రభుత్వ రాయితీని వినియోగించుకుంటూ తక్కువ రాయల్టీ చెల్లించి దిగు మతి చేసుకుంటున్నాయి. ఫలితంగా జిల్లాకు రావాల్సిన ఆదాయం దాదాపు రూ.9.5కోట్లు తగ్గుతూ పావువంతుకు పడిపోతోంది. జిల్లా ఆవిర్భంచిన తొలినాళ్లలో గ్రానైట్ పరిశ్రమల అభివృద్ధి కోసం ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేయాలని, ఇందుకోసం నెల్లికుదురు-తొర్రూరు, మహబూబాబాద్-మరిపెడ ప్రాంతాల్లో గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లను నెలకొల్పాలని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రతిపాదనలు పెట్టా రు. అయితే అవి ప్రతిపాదనల్లోనే నిలిచిపోయి గ్రానైట్ పరిశ్రమలను ఏర్పాటు చేయ డంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే జిల్లాకు ఆదాయం రావడంతోపాటు వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లవుతుంది.
పరిశ్రమలను ఏర్పాటు చేయాలి : అంబటి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, కేసముద్రం
జిల్లాలో పుష్కలంగా గ్రానైట్ నిల్వలున్నప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గ్రానైట్ ఎగుమతుల ద్వారా జమ అయిన నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. క్వారీలు ఉన్న గ్రామాల అభివృ ద్ధికి, కార్మికుల సంక్షేమానికి నిధులను కేటాయించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలి.