పారిశుధ్య విధానం భేష్‌

ABN , First Publish Date - 2022-11-27T23:53:07+05:30 IST

వరంగల్‌ నగరంలో పారిశుధ్య విధానాలు భేషుగ్గా ఉన్నాయని నేపాల్‌ దేశంలోని నగర మేయర్లు కితాబిచ్చారు. నేపాల్‌ దేశంలోని వివిధ నగరాలకు చెందిన మేయర్లు, మంత్రులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందం ఆదివారం నగరంలో పర్యటించింది.

పారిశుధ్య విధానం భేష్‌
వరంగల్‌ నగర పర్యటనలో నేపాల్‌ మేయర్ల బృందం

నేపాల్‌ మేయర్ల కితాబు.. నగరంలో పర్యటన

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), నవంబరు 27: వరంగల్‌ నగరంలో పారిశుధ్య విధానాలు భేషుగ్గా ఉన్నాయని నేపాల్‌ దేశంలోని నగర మేయర్లు కితాబిచ్చారు. నేపాల్‌ దేశంలోని వివిధ నగరాలకు చెందిన మేయర్లు, మంత్రులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందం ఆదివారం నగరంలో పర్యటించింది. నగర పారిశుధ్య విధానాల పరిశీలన, అఈ్యయనం కోసం పర్యటన జరిగింది. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ, ఎస్‌టీపీ, ఎఫ్‌ఎ్‌సటీ ప్లాంట్లు, పారిశుధ్య విధానాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో బృందం పరిశీలించింది. నగర పారిశుధ్య విధానాలను ఆసక్తిగా పరిశీలించింది. పారిశుధ్య సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలు, ప్లాంట్లు, వాహనాల గురించి అడిగి తెలుసుకున్నారు. మానవ రహిత పారిశుధ్య విధానాల గురించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా నేపాల్‌ దేశంలో నగర పారిశుధ్య విధానాలు అమలు పరిచేలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు.

మేయర్‌తో సమావేశం

నగర పర్యటన అనంతరం నేపాల్‌ ప్రతినిధుల బృందం హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్‌ గుండు సుధారాణితో సమావేశమైంది. ఈసందర్భంగా మేయర్‌ సుధారాణి పారిశుధ్య విధానాలను వివరించారు. నగరంలో భూగర్భ డ్రైయినేజీ వ్యవస్థ లేనప్పటికీ ఆన్‌-సైట్‌ విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలియచేశారు. వరంగల్‌ నగర పారిశుధ్య విధానాలు దేశంలోని ఇతర నగరాలకే కాకుండా వివిధ దేశాల్లోని నగరాలను కూడా ఆకర్శిస్తున్నాయని మేయర్‌ సుధారాణి వెల్లడించారు. సమగ్రాభివృద్ధి దిశగా వరంగల్‌ ఉన్నతీకరణ చెందుతుందని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దిశా, నిర్దేశంతో ముందకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. 2022లో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌, గ్లోబల్‌ నెటవర్క్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ సిటీ్‌స(యునెస్కో)లో నగరానికి సభ్యతం లభించడాన్ని మేయర్‌ సుధారాణి నేపాల్‌ బృందానికి వివరించారు. గ్రీన్‌ సిటీగా నగరం రూపాంతరం చెందుతోందన్నారు. మెరుగైన ఆరోగ్య జీవన శైలికి అనువైనదిగా నగరాన్ని మారుస్తున్నట్లు వెల్లడించారు. బెస్ట్‌ లివింగ్‌ సిటీగా వరంగల్‌ పేరొందుతోందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పోటీల్లో నగరం 62వ ర్యాంక్‌ సాధించడం, 204 పబ్లిక్‌ టాయిటెట్లు, షీ టాయిలెట్లు, ఎఫ్‌ఎ్‌సటీ, ఎస్‌టీపీల నిర్వహణ తదితర అంశాలను తెలియచేశారు. సమావేశం అనంతరం నేపాల్‌ బృందం సభ్యులను మేయర్‌ సన్మానించారు. జ్ఞాపికను అందచేశారు.

Updated Date - 2022-11-27T23:53:09+05:30 IST