దేవాదుల కాల్వ నిర్మాణానికి సహకరించాలి : మంత్రి

ABN , First Publish Date - 2022-11-27T00:51:53+05:30 IST

పాలకుర్తి మండలం నుంచి రాయపర్తి మండలా నికి వచ్చే దేవాదుల కాల్వనిర్మాణం కోసం ఆయా గ్రామాల రైతులు సహకరిం చాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిచేశారు. శనివారంరాయపర్తి మండలం కొలన్‌పెల్లి ప్రభుత్వ పాఠశాలలో దేవాదుల కాల్వ నిర్మాణ పనులపై ఎనిమిది గ్రామాల బాధిత రైతులు, ఉన్న తాధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా భూమి కోల్పోతు న్న రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ మండ లంలోని కేశవపురం, గన్నారం, కొలన్‌పెల్లి, బురాహన్‌పెల్లి, కాట్రపెల్లి గ్రామాలతోపాటు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మరో మూడు గ్రామాల రైతుల భూములు దాదాపు 112ఎకరాలు దేవాదుల కాల్వ నిర్మాణం కోసం అధికారులు సర్వే చేసి ఉన్నారన్నారు.

దేవాదుల కాల్వ నిర్మాణానికి   సహకరించాలి : మంత్రి

రాయపర్తి, నవంబరు 26: పాలకుర్తి మండలం నుంచి రాయపర్తి మండలా నికి వచ్చే దేవాదుల కాల్వనిర్మాణం కోసం ఆయా గ్రామాల రైతులు సహకరిం చాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిచేశారు. శనివారంరాయపర్తి మండలం కొలన్‌పెల్లి ప్రభుత్వ పాఠశాలలో దేవాదుల కాల్వ నిర్మాణ పనులపై ఎనిమిది గ్రామాల బాధిత రైతులు, ఉన్న తాధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా భూమి కోల్పోతు న్న రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ మండ లంలోని కేశవపురం, గన్నారం, కొలన్‌పెల్లి, బురాహన్‌పెల్లి, కాట్రపెల్లి గ్రామాలతోపాటు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మరో మూడు గ్రామాల రైతుల భూములు దాదాపు 112ఎకరాలు దేవాదుల కాల్వ నిర్మాణం కోసం అధికారులు సర్వే చేసి ఉన్నారన్నారు. కొలన్‌పెల్లిలోనే దాదాపు 80ఎక రాల సాగుభూమి కావాలని నివేదికలో వెల్లడించారన్నారు. ప్రభుత్వం రైతుల పై సానుకూలంగా ఉందని,ఎకరానికి రూ.9లక్షల వరకు వచ్చేలా చూస్తానని హామీఇచ్చారు. గ్రా మాల్లో ఉండే చెరువుల్లోకి దేవాదుల నీటిని తీసుకురావడం ద్వారా తాగు నీటి సమస్య కూడా తీరుతుందన్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన ప్రతీ రైతు నష్టపరిహారం అందిస్తామని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని కలెక్టర్‌ గోపి స్పష్టం చేశారు. ప్రభుత్వ రేటు ప్రకారం దానికి సగం రేటును కలిపి రైతుకు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం అందించే పరిహారంనచ్చని రైతులు ట్రి బ్యునల్‌కు వెళ్లవచ్చని, దాని ప్రకారం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. దేవాదుల కాల్వ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో దేవాదుల చీఫ్‌ ఇంజనీర్‌ సు ధాకర్‌రెడ్డి, ఈఈ సీతారాంనాయక్‌, ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎం పీపీ జీనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, సర్పంచ్‌ రాజేందర్‌, రైతు బంధు చైర్మన్‌ ఆకుల సురేందర్‌రావు, ఎంపీడీవో కిషన్‌నాయక్‌, నాయకుడు సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T00:51:55+05:30 IST