నెరవేరిన కల

ABN , First Publish Date - 2022-11-15T23:33:42+05:30 IST

హైదరాబాద్‌ నుంచి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నెరవేరిన కల

మహబూబాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌లో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలల స్థాపనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఎనిమిది వైద్య కళాశాలలను ప్రారంభించుకోవడం వైద్య విద్య చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడిన రోజని, ఇది చారిత్రాత్మ కమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసు కుపోతుందనడానికి వైద్య కళాశాలల ఏర్పాటే నిదర్శన మని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కళాశాలలను ప్రారంభించామని తెలిపా రు. మరో 17 కళాశాలలను ప్రారంభించుకోవాల్సి ఉంద న్నారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే ఇన్ని వైద్య కళా శాలలను ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయ మన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, ప్రస్తుతం అవి 2790కు పెంచుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా 515 పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు ఉండగా 1180 సీట్లకు, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 70 ఉండగా 150కి పెరిగాయన్నారు. వైద్య, పారా మెడికల్‌ విద్యను పటిష్టం చేస్తామన్నారు. మారుమూల గిరిజన ప్రాంతం, తెలంగాణ ఉద్యమగడ్డ మానుకోటలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ఆనం దంగా ఉందన్నారు. దీనికి తోడు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కూడా వైద్యసౌకర్యాలు మెరుగుపర్చాలనే ఉద్ధేశంతో మెడికల్‌ కళాశాలలను మంజూరు చేశామ న్నారు. వైద్యరంగాలతో పాటు అనుబంధ రంగాలను కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు వైద్య వృత్తిలో నిష్ణాతులై ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.

ఒడిదొడుకులను అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి :

కలెక్టర్‌ శశాంక

వైద్య విద్య కోసం కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఎ న్ని ఒడిదొడుకులు వచ్చినా వాటిని అధిగమిస్తూ లక్ష్యా న్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ శశాంక సూచించారు. మహబూబాబాద్‌లో వైద్య కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజలకు మెరిగైన వైద్యసేవలందించేందు కు ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నా రు. వైద్య కళాశాల శంకుస్థాపనతో పాటు ప్రారంభించు కునే అవకాశం తనకు దక్కినందున సంతోషంగా ఉంద న్నారు. కళాశాలలో ప్రవేశాలు పొందిన 90 విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళాశాల వరకు రవాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండ సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వెయ్యి మందికి 30 నుంచి 40 మంది డాక్టర్లు ఉంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇద్దరు మాత్రమే వైద్యులున్నారని తెలిపారు. మానుకోట నూతన మెడికల్‌ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకుంటామ నికళాశాల హెచ్‌వోడీ డాక్టర్‌ సీతామ హాలక్ష్మి అన్నా రు. విద్యార్థులకు ఏ లోటు రానియ్యకుండా చూసు కుంటామని, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. అనంతరం జిల్లా అధికారులను ఘనంగా సన్మానించా రు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ జాటోతు వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ బత్తుల శ్రీనివాసరావు, ఆర్డీవో కొమురయ్య, కమిషనర్‌ ప్రసన్నారాణి, స్థానిక వార్డు కౌన్సిలర్‌ హరిసింగ్‌ నాయక్‌, జిల్లా అధికారులు హరీష్‌రాజ్‌, డాక్టర్‌ వెంకట్రాములు, తానేశ్వర్‌, ఉమామహేష్‌, నాగభవాని, విజయ్‌, సునిత, అధ్యాపకులు కాత్యాయని, జాదవ్‌, శ్రీహరి, డాక్టర్‌ శ్రీకుమార్‌, శ్రీధర్‌, భగవాన్‌రెడ్డి, భరత్‌కుమార్‌ పాల్గొన్నారు.

సీఎంతో వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం అదృష్టం

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో మెడికల్‌ కళాశాల ప్రారంభం కావడంతో జిల్లాకు మహర్ధశ పట్టనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే ఎనిమిది వైద్య కళాశాలలను ప్రారంభించుకోవడం చారిత్రాత్మకమని చెప్పారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఇది సూవర్ణ అవకాశమని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేసి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు...

- బి. నిహారిక, ఎంబీబీఎస్‌ విద్యార్థి, మహబూబాబాద్‌ జిల్లా

గిరిజన, వెనుకబడిన జిల్లాగా పేరున్న మానుకోటకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మెడికల్‌ కళాశాల ప్రారంభంతో ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యపై ఆసక్తి పెరుగుతోంది. వైద్యవిద్య అభ్యసించాలంటే ఎంతో కష్టంతో కూడుకుని ఉండేది. కళాశాల ప్రారంభంతో ఈ ప్రాంత విద్యార్థులకు కొత్త ఉత్సాహం వచ్చింది.

తల్లిదండ్రుల కల నెరవేర్చుతాను..

- సాక్షి, విద్యార్థి, హైదరాబాద్‌

తాను డాక్టర్‌ కావాలనే నా తల్లిదండ్రుల కలలను నెరవేర్చుతాను. రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలలను మంజూరు చేయడంతో సీట్ల సంఖ్య పెరగటం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్‌ విద్యను అభ్యసించే అవకాశం దక్కింది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.

Updated Date - 2022-11-15T23:33:42+05:30 IST

Read more