మట్వాడ ఆదర్శం

ABN , First Publish Date - 2022-12-09T00:21:49+05:30 IST

చుట్టు గుట్టలు.. పచ్చని అడవి.. మధ్యలో ఓ ఏజెన్సీ గ్రామం. ఆ గ్రామంలో పదేళ్లుగా మద్యపాన నిషేదం... గంగాదేవిపల్లి తరహాలో అభివృద్ధి.. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన గ్రామం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మట్వాడ గ్రామం. ఈ గ్రామంలో అత్యధికంగా ఆదివాసీ, గిరిజనులే అధికంగా నివసిస్తున్నారు. గిరిజ నేతరుల శాతం చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా వ్యవసాయంపై ఆధా రపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఆదర్శ గ్రామ పాలన సాగుతుంది.

మట్వాడ ఆదర్శం

స్వచ్ఛంద మద్యపానం నిషేధం

పది సంవత్సరాలుగా అమలు

మట్వాడ గ్రామంలో మద్యం అమ్మితే రూ.5వేల జరిమానా

ఏజెన్సీ గ్రామంలో గంగదేవిపల్లి తరహాలో అభివృద్ధి

గ్రామాన్ని కలెక్టర్‌ దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి

గూడూరు, డిసెంబరు 8 : చుట్టు గుట్టలు.. పచ్చని అడవి.. మధ్యలో ఓ ఏజెన్సీ గ్రామం. ఆ గ్రామంలో పదేళ్లుగా మద్యపాన నిషేదం... గంగాదేవిపల్లి తరహాలో అభివృద్ధి.. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన గ్రామం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మట్వాడ గ్రామం. ఈ గ్రామంలో అత్యధికంగా ఆదివాసీ, గిరిజనులే అధికంగా నివసిస్తున్నారు. గిరిజ నేతరుల శాతం చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా వ్యవసాయంపై ఆధా రపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఆదర్శ గ్రామ పాలన సాగుతుంది. గ్రామాభివృద్ధి కోసం మద్య నిషేధిత, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం, తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి విధికి సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, సైడ్‌ కాల్వలు, ఇంటింటి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రక్షిత మంచి నీటి కోసం నల్లాల నిర్మాణాలు ఆదర్శనీయంగా ఉన్నాయి.

మద్యం అమ్మితే రూ.5వేల జరిమానా

గ్రామంలో రోడ్డుపైన చెత్త వేస్తే రూ.500, మద్యం అమ్మినా, తాగిన రూ.5వేల జరిమానా విధిస్తారు. 10 ఏళ్లుగా ఈ విఽధానం అమలవుతుంది. తొమ్మిది సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ వాకటి కరుణ గ్రామాన్ని సందర్శించి అభినందించారు. ఇంటికి ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించకపోతే సంక్షేమ పథకాలల్లో కోత విధిచనున్నట్లు జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ ఖాసీం గ్రామ సభలో ప్రకటించిన విషయం విధితమే.

రహదారుల నిర్మాణం భేష్‌

ఇటీవల కాలంలో సుమారు రూ.3కోట్లతో మట్వాడ నుంచి నేలవంచ, మట్వాడ నుంచి కొంగ రగిద్ద శివారు గ్రామాలకు రహదారులు నిర్మాణాలను పూర్తి చేశారు. అట్లాగే రూ.2.25 కోట్లతో మట్వాడ-కొంగరిగిద్దల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇదే గ్రామానికి చేందిన జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఖాసీం జడ్పీటీసీగా, జడ్పీ స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌గా ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో వాడవాడలా సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.

హనుమాన్‌తండాలో మద్యం నిషేధం

మాట్వాడ గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన హనుమాన్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలో 4 ఏళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేదం అమల వుతుంది. ఆదర్శ గ్రామ పంచాయతీగా రుపుదిద్దుకునేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం కృషి చేస్తుంది.

మట్వాడ గ్రామాన్ని కలెక్టర్‌ దత్తత తీసుకోవాలి : మహ్మద్‌ ఖాసీం, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు, గూడూరు

జిల్లాలో మట్వాడ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందింది. 10 సంవత్సరాలుగా మద్యపాన నిషేదం సంపూర్ణంగా అమలవుతుంది. గంగాదేవిపల్లి తరహాలో అభివృద్ధి చేదుతుంది. మట్వాడ గ్రామ పంచాయతీని కలెక్టర్‌ శశాంకను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం : ఈసం సంధ్య, సర్పంచ్‌, మట్వాడ, గూడూరు

మట్వాడ గ్రామా న్ని గ్రామస్తులు, గ్రామస్థాయి కమిటీల సహకారంతో సమష్టి నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. సంపూర్ణ మద్యం నిషేదానికి గ్రామస్తులం దరు సహకారించారు. విద్య, వైద్య, పారిశుధ్యలపై ప్రధాన దృష్టి పెట్టిన్నట్లు తెలిపారు.

మట్వాడ మాకు ఆదర్శం : జాటోత్‌ జ్యోతి, సర్పంచ్‌, హనుమాన్‌తండా, గూడూరు

మా గ్రామ పంచాయతీ మట్వాడ గ్రామ పంచాయతీ నుండి విడిపోయి నూతన గ్రామ పం చాయతీగా ఏర్పాడిం ది. మట్వాడలో అమ లవుతున్న సంపూర్ణ మద్యపాన నిషేదం, అభివృద్ధి పట్ల పోటీ పడుతున్నాం.

Updated Date - 2022-12-09T00:22:10+05:30 IST