కైలాస్‌ సత్యర్థి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-12-15T00:20:38+05:30 IST

ఈ నెల 18, 19 తేదీల్లో నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యర్థి జిల్లా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్‌ కలెక్టర్‌ గోపి, ‘కుడా’ చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, వరంగ్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి బాలసముద్రంలోని హ యగ్రీవాచారి గ్రౌండ్‌ను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

కైలాస్‌ సత్యర్థి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
హయగ్రీవాచారి గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి

హనుమకొండ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 18, 19 తేదీల్లో నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యర్థి జిల్లా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్‌ కలెక్టర్‌ గోపి, ‘కుడా’ చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, వరంగ్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి బాలసముద్రంలోని హ యగ్రీవాచారి గ్రౌండ్‌ను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కొన్ని సూచనలు చేశారు. వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రౌండ్‌కు వచ్చే రహదారిని మరమ్మతు చేయాలన్నారు. మైదాన్నంతా శుభ్రం చేయాలని, దుమ్ము రేగకుండా నీళ్లు చల్లాలని, విద్యుత్‌ దీపాలను అమర్చాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.

అనంతరం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి కైలాష్‌ సత్యర్థి పర్యటనను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. ఈ నెల 18న కైలాష్‌ సత్యర్థి సుబేదారిలోని ఆదాలత్‌ను సందర్శిస్తారన్నారు. 19న ఉదయం 10గంటలకు హయగ్రీవచారి మైదానంలో విద్యార్థుల హక్కులు-చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఆయన పాల్గొనే బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2022-12-15T00:20:40+05:30 IST