గోల్కొండ కోటపై బీసీ జెండా

ABN , First Publish Date - 2022-12-16T00:13:50+05:30 IST

రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు కేవలం రాజకీయ పార్టీల జెండాలు మోయడానికే పనిచేస్తున్నారని, తామం తా సంఘటితమై గోల్కొండ కోటపై బీసీ జెండా ను ఎగరవేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

గోల్కొండ కోటపై బీసీ జెండా
ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో పోరుయాత్ర సభలో అభివాదం చేస్తున్న బీసీ నేతలు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌

వడ్డెపల్లి, డిసెంబరు 15: రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు కేవలం రాజకీయ పార్టీల జెండాలు మోయడానికే పనిచేస్తున్నారని, తామం తా సంఘటితమై గోల్కొండ కోటపై బీసీ జెండా ను ఎగరవేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరు యాత్ర సభ గురువారం హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో బీసీ విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అరెగంటి నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడారు.

విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాం డ్‌ చేశారు. రాయితీలకు బీసీలు రాజీపడకుండా సంఘటితమై రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అర శాతం ఉన్న వెలమలు, 5 శాతం ఉన్న రెడ్లు 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రా న్ని ఏలుతున్నారని, జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు వారికి ఓటు బ్యాంకుగానే ఉపయోగపడుతున్నారని అన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు కే వలం 25 శాతం రిజర్వేషన్లు మాత్రమే అందుతున్నాయని, జనాభా ధామాషా ప్రకారం రిజర్వేష న్లు వర్తింపచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థు లు రోడ్లు ఎక్కడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు జీతాలు పెం చుకుంటున్నారే తప్ప హాస్టల్‌, గురుకులాల్లో ఉండే పేద విద్యార్థుల స్కాలర్‌షి్‌పలను ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అధికారం చేపట్టడానికి పనికిరారా అని ఆయన ప్రశ్నించారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరి రవికృష్ణ మాట్లాడుతూ.. బీసీల ఓట్లు బీసీలే వేసుకొని పాలకులుగా మారాలని పిలుపు నిచ్చారు. ఈ సభలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నా యకులు దాడి మల్లయ్యయాదవ్‌, చిర్ర రాజుగౌడ్‌, తాళ్ల సంపత్‌కుమార్‌, తాటికొండ విక్రం, కనకాల శ్యాం, చిర్ర సుమన్‌, సబ్బు అనిల్‌కుమార్‌, కాసగాని అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. కళాకారుల ఆట పాటలు అలరించాయి.

Updated Date - 2022-12-16T00:13:51+05:30 IST