పరవాలేదు!

ABN , First Publish Date - 2022-12-31T00:52:31+05:30 IST

అభివృద్ధిలో రెండడుగులు ముందుకు.. వెనక్కు అందుబాటులోకి నూతన కలెక్టరేట్‌, జిల్లా కోర్టు మెడికల్‌ కళాశాలకు శ్రీకారం అటకెక్కిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ల ఏర్పాటు ఆరేళ్లయినా మోక్షం కలగని లెదర్‌ పార్కు

పరవాలేదు!

ప్రస్తుత సంవత్సరం జనగామ జిల్లాకు కొంత ఊరటనిచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొన్ని అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. జిల్లా ప్రజల చిరకాల డిమాండ్ల పరిష్కారానికి కొంతమేర పునాది పడింది. నూతన కలెక్టరేట్‌ తో పాటు జిల్లా కోర్టు అందుబాటులోకి వచ్చిం ది. మెడికల్‌ కళాశాల ఏర్పాటు ప్రక్రియ సైతం చురుగ్గా సాగుతోంది. కొడకండ్ల మినీ టెక్స్‌టైల్‌ పార్కు కోసం స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభమైం ది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని ప్రభుత్వ హామీలకు ఈ ఏడాదిలోనూ మోక్షం కలగలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌ లెదర్‌ పార్కు, నియోజకవర్గా నికి ఒకటి చొప్పున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌, జిల్లాలో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుపై ప్రస్తావనే లేదు.

జనగామ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యో తి): పోరాటాల ద్వారా సాధించుకున్న జనగామ జిల్లాలో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకురావ డం ఈ ఏడాది కలిసొచ్చిన ప్రధాన అంశం. 2016లో జిల్లాగా ఏర్పడిన తర్వాత తాత్కాలిక భవనంలో కలెక్టరేట్‌ కొనసాగించారు. కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.58 కోట్లు కేటాయించగా 2017లో పను లు ప్రారంభమయ్యాయి. 2021 జూన్‌ నెలలోనే పను లు పూర్తి కాగా సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖాళీగా లేని కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చిం ది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ముఖ్య మంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా జనగామ కలెక్టరేట్‌ ప్రారం భం జరిగింది. కలెక్టరేట్‌తో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సైతం కేసీఆర్‌ ప్రారంభించారు. ఇప్పటి కీ చాలా జిల్లాల్లో నిర్మాణాలు జరుగుతున్న తరుణంలో జనగామ కలెక్టరేట్‌ పనులు పూర్తయి అందుబాటులోకి రావడం మంచి పరిణామం. 25 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన కలెక్టరేట్‌ సీఎం చేతుల మీదుగా ప్రారంభమై ప్రజలకు సేవలను అందిస్తోంది.

మెడికల్‌ కళాశాలకు అడుగులు

జిల్లా ప్రజల చిరకాల డిమాండ్‌, కేసీఆర్‌ 2018 ఎన్నికల హామీ అయిన మెడికల్‌ కళాశాల ఏర్పాటు ప్రక్రియకు ఈ ఏడాదిలోనే పునాది పడింది. 2018 ఎన్నికల ప్రచారం సందర్భంగా జనగామకు వచ్చిన కేసీఆర్‌.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చినప్పటికీ హామీల ను అమలు చేయలేదు. దీంతో పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహించాయి. మెడికల్‌ కాలేజీపై ప్రకటన చేయకుండా కలెక్టరేట్‌ ప్రారంభానికి కేసీఆర్‌ను రానివ్వబోమంటూ పార్టీలు, విద్యార్థి సంఘా లు ప్రకటించాయి. దీంతో కలెక్టరేట్‌ ప్రారంభం అనంత రం ఏర్పాటు చేసిన సభలో జనగామకు మెడికల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటన తర్వాత ప్రక్రియ వేగవంతమైంది. మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి పట్టణంలోని 18.23 ఎకరాల హౌజింగ్‌ బో ర్డు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాటు ఆసుపత్రికి సరిపడా భవనాల కోసం చంపక్‌హిల్స్‌లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కాగా.. ఇటీవలే జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌తో పాటు క్రిటికల్‌ ఆసుపత్రిని మంజూరు చేస్తూ ప్రభుత్వం రూ.49.27 కోట్లు మంజూ రు చేసింది. జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌కు రూ. 36.49 కోట్లు, క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రి నిర్మాణానికి రూ.12.77 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జిల్లా కోర్టు ఏర్పాటు

జనగామను జ్యుడిషియల్‌ జిల్లాగా ప్రకటిస్తూ ప్రభు త్వం మే 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిం చింది. కాగా జూన్‌ 2న జిల్లా కోర్టు అందుబాటులోకి వచ్చింది. అప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా సాగిన కోర్టు సేవలు జూన్‌ 2 నుంచి జనగామ కేంద్రం గానే అందుతున్నాయి. జ్యుడీషియల్‌ జిల్లాలను ప్రభు త్వం ఏర్పాటు చేయడంతో జనగామ జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన కోర్టు కేసులు జనగామ కోర్టు కిందకే వచ్చాయి.

‘ఫుడ్‌ ప్రాసిసింగ్‌’, లెదర్‌ పార్కు ప్రస్తావనేది?

జనగామలో జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ల ఏర్పా టుపై ప్రభుత్వం ఈ ఏడాదిలోనూ ప్రస్తావన తేలేదు. తొలుత జిల్లాకు ఒకటి చొప్పున అని ప్రకటించగా ఆ తర్వాత నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు. ఇందులో భాగంగా దేవరు ప్పుల మండలం మన్‌పహాడ్‌, తరిగొప్పుల మండల కేంద్రం, చిల్పూరు మండలం నష్కల్‌లో స్థల పరిశీలన చేశారు. దీంతో పాటు రూ.100 కోట్లతో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమను సైతం ఏర్పాటు చేస్తామని గతేడాది ప్రకటించారు. వీటిలో ఏ ఒక్కదానిపై ప్రస్తావనను ప్రభుత్వం తీసుకురాలేదు. 2020 జనవరిలో మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చిన కొడకండ్ల మినీ టెక్స్‌టైల్‌ పార్కుకు సంబంధించి కొంతమేర కదలిక వచ్చింది. కేటీఆర్‌ ఆదేశాలతో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. దీంతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్‌ అయిన లెదర్‌ పార్కుపై కూడా ఈఏడాది స్పష్టత రాలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌ పార్కు ఏర్పాటు చేస్తామని 2016 డిసెంబరు 20న అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆరేళ్లు పూర్తి అయినప్పటికీ మోక్షం కలగలేదు.

Updated Date - 2022-12-31T00:52:37+05:30 IST