సకాలంలో రుణాలు అందించాలి

ABN , First Publish Date - 2022-12-16T23:58:48+05:30 IST

బ్యాంకులు సకా లంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు బ్యాంకర్లను ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జి ల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాలను సకాలంలో అందించి, రైతులు పంట రుణాలను తిరిగి చెల్లించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో మ హిళా సంఘాలకు 481 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నా మని, దీనిలో ఇప్పటివరకు సంఘాలకు 261 కోట్లు అందించి 46శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు.

సకాలంలో రుణాలు అందించాలి
క్రెడిట్‌ ప్లాన్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌, బ్యాంకు అధికారులు

హనుమకొండ రూరల్‌, డిసెంబరు 16: బ్యాంకులు సకా లంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు బ్యాంకర్లను ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జి ల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాలను సకాలంలో అందించి, రైతులు పంట రుణాలను తిరిగి చెల్లించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో మ హిళా సంఘాలకు 481 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నా మని, దీనిలో ఇప్పటివరకు సంఘాలకు 261 కోట్లు అందించి 46శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. అర్హత ఉన్న సంఘాలకు అందించి రెన్యూవల్‌ ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా చూడాలన్నారు. అలాగే వీధి వ్యాపారులకు అందించే రుణా లను పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం ఈజీపీ కింద 23 యూనిట్లు మాత్రమే మంజూరు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వీడాలని కలెక్టర్‌ హితవు పలికారు. అనంతరం 2023-24 ఆర్ధిక సంవ త్సరానికి సంబంధించిన పొటెన్షియల్‌ లింక్‌ క్రెడిట్‌ ప్లాన్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావు, ఆర్‌బీఐ అధికారి మహ్మద్‌ అలీబాబా, నాబార్డు జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌, ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ హరికృష్ణ, పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ హరిప్రసాద్‌, మెప్మా పీడీ భద్రునాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:58:49+05:30 IST