రైతు సమస్యలు పట్టని ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-11-25T00:18:31+05:30 IST

రైతులు ఎదుర్కొంటున్న బాధ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఏఐసీసీ మహిళా ప్రధా న కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు.

రైతు సమస్యలు పట్టని ప్రభుత్వాలు
ములుగు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ నాయకులు

ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క

కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణుల ధర్నా

ములుగు కలెక్టరేట్‌, నవంబరు 24: రైతులు ఎదుర్కొంటున్న బాధ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఏఐసీసీ మహిళా ప్రధా న కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. రైతుల సమస్య లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా సీతక్క మాట్లాడుతూ ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్టకొడు తోందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు చరమగీతం పాడాలన్నారు. ప్రజల ఆస్తుల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు వెల్లడిస్తున్నారని విమర్శించారు. తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని, పోడుభూములకు హక్కుపత్రాలు అందించాల ని, ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సత్యనారాయణస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, బానోత్‌ రవిచందర్‌, కంబాల రవి, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, ఎమ్డీ.చాంద్‌పాషా, ఆకుతోట చంద్రమౌళి, బండి శ్రీనివాస్‌, బొక్క సత్తిరెడ్డి, వంగ రవి యాదవ్‌, మామిడిశెట్టి కోటితోపాటు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:18:34+05:30 IST