ప్రైవేటుకు దీటుగా..

ABN , First Publish Date - 2022-12-13T00:03:43+05:30 IST

పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తిదారులకు కానుకలు సరికొత్త పథకాలు ప్రకటించిన అధికారులు సత్ఫలితాలిస్తున్న ప్రోత్సాహకాలు జిల్లాలో 6450 మంది పాడి రైతులకు ప్రయోజనం

ప్రైవేటుకు దీటుగా..

లింగాలఘణపురం, డిసెంబరు 12: పాల సేకరణలో ప్రైవేటు సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు విజయ డెయిరీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జిల్లాలో 6450 మంది రైతుల నుంచి ప్రతీ రోజు 27800 లీటర్ల పాలను విజయడెయిరీ సేకరిస్తోంది. అయితే 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు సుమారు 33 నెలలకు సం బంఽధించి లీటర్‌ పాలకు రూ. 4 లెక్కన చెల్లించే ప్రోత్సా హక నగదు సుమారుగా రూ.9.90 కోట్లు నిలిచిపోయా యి. దీంతో పాల ఉత్పత్తిదారులు ప్రైవేటు డెయిరీల వైపు దృష్టిని మరల్చకుండా సరికొత్త కానుకలను అంది స్తోంది. విద్యార్థులకు విద్యాకానుక, ఆడబిడ్డల పెళ్లిళ్లకు వివాహ కానుక, పాడిగేదెల కొనుగోలుకు సబ్సిడీ, పాల ఉత్పత్తిదారుడు మృతిచెందితే అంత్యక్రియల ఖర్చుల చెల్లింపులు, పాడిగేదెకు ఇన్సూరెన్స్‌ చేయిస్తే నగదు ప్రోత్సాహకం ఇలా అనేక పథకాలకు విజయడెయిరీ శ్రీకారం చుట్టింది.

కానుకల చెల్లింపులు ఇలా..

పాల ఉత్పత్తిదారుడి కుటుంబంలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాసైనా, మెడిసిన్‌ సీటు సాధించినా లేక పదోతరగతిలో 10జీపీఏ సాధించినా రూ.వెయ్యి నుంచి రూ.10వేల వరకు విజయడెయిరీ నగదును ప్రోత్సాహ కంగా అందజేస్తోంది. ఆడబిడ్డ పెళ్లి చేస్తే వివాహ కానుక కింద రూ.5వేలు, ఉత్పత్తిదారుడు దురదృష్టవశా త్తు మృతిచెందితే అంత్యక్రియల ఖర్చుల కింద రూ. 5వే లు, పాడిగేదె కోసం బ్యాంకుల్లో రుణం తీసుకుంటే రూ. 10వేలు, పాడిగేదెకు ఇన్సూరెన్స్‌ చేస్తే రూ. వెయ్యి నగ దు చెల్లిస్తోంది. వీటితో పాటుగా ప్రతీ దాణా సంచి కొ నుగోలులో రూ.600 సబ్సిడీ, మినరల్‌ మిక్చర్‌లాంటి ఇత ర న్యూట్రిషన్లను కొనుగోలు చేస్తే ఆసక్తికరమైన సబ్సిడీ లను అందజేస్తూ ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తోంది.

పశువులకు ఉచిత వైద్యశిబిరాలు..

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న విజయ పాలసేకర ణ కేంద్రాల పరిధిలోని పాడిపశువులకు విజయడెయిరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. కేవ లం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావాన్ని విస్త రించేందుకు ప్రతీ నెల ఉత్పత్తిదారులకు పాడి ఉత్పత్తి లో మెళకువలు నేర్పిం చేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వ హిస్తోంది. పాడి రైతు ఇంటి వద్దే పశువుకు కృత్రి మ గర్భదారణ, ఏడా దిలో నాలుగు సార్లు త్రైమాసాకానికి ఓ సారి గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది.

కానుకలతో పాడి రైతులకు ఊరట

జిల్లా వ్యాప్తంగా పాడిరైతులకు అందాల్సిన సుమారు రూ. 9.90 కోట్ల పెండింగ్‌లో ఉండటంతో ఒకింత నిరుత్సాహ పడు తున్న రైతాంగానికి విజయ డెయిరీ చేపట్టిన సరికొత్త కానుకలు కాస్త ఊరట నిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 53 మంది ఆడబిడ్డల కట్నానికి రూ.5వేల లెక్కన రూ. 2.65 లక్షలను అందజేసింది. అదేవిధంగా 25 మంది సభ్యులు మృతిచెందగా వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు ల కింద రూ.5వేల లెక్కన 1.25 లక్షలను పంపిణీ చేసిం ది. అయితే విద్యాకానుకల విషయానికి వస్తే పథకాలన్నీ ఈ ఏడాది నుంచే షురూ కావడంతో విద్యార్థుల పోటీప రీక్షలకు సమయం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం ఆరం భంలోగా వందలాది మంది విద్యార్థులు విద్యా కాను కలను అందుకునే అవకాశాలున్నాయి.

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం

- జి.ధన్‌రాజ్‌- డిప్యూటీ డైరెక్టర్‌, టీఎస్‌డీడీసీఎఫ్‌, జనగామ

జిల్లాలోని పాడి రైతుల సంక్షమమే లక్ష్యంగా పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పనిచేస్తోంది. ప్రైవే టు డెయిరీల మాదిరిగా వ్యాపారధోరణితో కాకుండా రైతుల సంక్షేమంతో పాటుగా సేవాభావంతో పాడి రైతుల కష్టసుఖాల్లో పలుపంచుకుంటోంది. ఇప్పటి వరకు జిల్లాలో సంక్షేమ పథకాల కింద 78 కుటుంబాలకు రూ.3.90 లక్షలు అందజేశాం. ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధికి ఈ సంక్షమపథకాలు అద నంగా కొనసాగుతున్నాయి. ప్రోత్సాహక నిధిని ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో జమచేస్తాం.

Updated Date - 2022-12-13T00:03:46+05:30 IST