అధ్యక్ష తరహా పాలన దిశగా బీజేపీ యత్నాలు

ABN , First Publish Date - 2022-11-25T00:24:09+05:30 IST

దేశంలో అధ్యక్ష తరహా పాలన దిశగా కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. వరంగల్‌ నగరం రంగశాయిపేట ఉర్సు రోడ్‌ ప్రాంతంలో ని ఎంకే ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ కార్యకర్తలకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ముగింపు సమావేశానికి సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వా తంత్య్రం వచ్చి 75ఏళ్లు అయినా పేదవాడికి ఒరిగిందేమీ లేదన్నారు. మేనిఫెస్టోలో ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాలు ఇంకా రాలేదన్నారు. కేంద్రంలో నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆరో పించారు.

అధ్యక్ష తరహా పాలన  దిశగా బీజేపీ యత్నాలు
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

రాజ్యాంగ విలువలకు తిలోదకాలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

వరంగల్‌, నవంబరు 24 : దేశంలో అధ్యక్ష తరహా పాలన దిశగా కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. వరంగల్‌ నగరం రంగశాయిపేట ఉర్సు రోడ్‌ ప్రాంతంలో ని ఎంకే ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ కార్యకర్తలకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ముగింపు సమావేశానికి సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వా తంత్య్రం వచ్చి 75ఏళ్లు అయినా పేదవాడికి ఒరిగిందేమీ లేదన్నారు. మేనిఫెస్టోలో ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాలు ఇంకా రాలేదన్నారు. కేంద్రంలో నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆరో పించారు. దేశంలో ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలం అమలుకు కుట్ర చేస్తున్నారని, అందు కే ఫెడరల్‌ వ్యవస్థపై దాడి చేస్తున్నారని సాంబశివరావు ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్‌ల చేత పాలనలో జోక్యం చేసుకుంటూ, తమ కు లొంగని వారిని ఈడీ, ఐటీ, సీబీఐల చేత దాడులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు కలి సి కట్టుగా పోరాడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ప్రతిపక్షాలను అణచివేసే చర్యలను తిప్పికొట్టాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా ఎర్ర జెం డా పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. పేదరికంలో దేశం 107 స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. పేదల కొరకు అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీలు పేదల కొరకు పోరాటాలు చేసిన దాఖలాలు లేవన్నారు. వారికి కుర్చీలపై ఉన్న ప్రేమ పేదల పై లేదన్నారు. దేశంలోని ప్రతీ పేదవాడికి ఇండ్లు, ఇంటి స్థలాలు, దక్కే వరకు సీపీఐ భూపోరాటాలను కొనసాగిస్తుందన్నారు. భూ పోరాటాలలో పోరాటాల గడ్డ అయిన ఓరుగల్లు జిల్లా అగ్రభాగాన నిలువాలని తెలిపారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కళ్ళపల్లి శ్రీనివా్‌సరావు మాట్లాడుతూ.. కేం ద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టపెట్టుతూ పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ముకాస్తున్నాయని అన్నారు. సీపీఐ ఖిలావరంగల్‌ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ వరంగల్‌, హనుమకొండ, మహబూబాద్‌ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె భిక్షపతి, బివిజయసారథి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పంజాల రమేష్‌, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ భాషామియా, పనాస ప్రసాద్‌, తోట భిక్షపతి, ఖిలా వరంగల్‌ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్‌, జిల్లా నాయకులు

Updated Date - 2022-11-25T00:24:10+05:30 IST