అక్రమాలను బయటపెడతామనే అరెస్టులు

ABN , First Publish Date - 2022-12-15T00:23:46+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బయటపెడతామనే అక్కసుతోనే కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌పై సీఎం కేసీఆర్‌ పోలీసులతో దాడి చేయించడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌పై అక్రమకేసులు పెట్టి అరెస్టు చేశాడని డీసీసీ అధ్యక్షుడు నాయిని రా జేందర్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌పై పోలీసులు జరిపిన దాడి, పార్టీ వ్యూహకర్త సు నీల్‌ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ అశోక జంక్షన్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ ను దహనం చేశారు.

అక్రమాలను బయటపెడతామనే అరెస్టులు
హనుమకొండ అశోక జంక్షన్‌లో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి

అశోకా జంక్షన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల ధర్నా, సీఎం దిష్టిబొమ్మ దహనం

హనుమకొండ స్పోర్ట్స్‌, డిసెంబరు 14: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బయటపెడతామనే అక్కసుతోనే కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌పై సీఎం కేసీఆర్‌ పోలీసులతో దాడి చేయించడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌పై అక్రమకేసులు పెట్టి అరెస్టు చేశాడని డీసీసీ అధ్యక్షుడు నాయిని రా జేందర్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌పై పోలీసులు జరిపిన దాడి, పార్టీ వ్యూహకర్త సు నీల్‌ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ అశోక జంక్షన్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నియంతలా వ్యవరిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోతామనేభయంతోనే వార్‌రూమ్‌పై దాడి చేయించి.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సునీల్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. లిక్కర్‌స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణకు వెళ్లి వస్తున్న సమయంలో ఏదో స్వతంత్య్ర పోరాటానికి వెళ్లి వస్తున్నట్లుగా విజయకేతనం చూపించడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకుపోయి, ఆ పార్టీ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేస్తామనే భయంతోనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నాయిని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం సహించబోమని, ముందు ముందు మళ్లీ ఇలాంటి నిర్భంధం కొనసాగితే ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ధర్నా నేపథ్యంలో అరగంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, శ్రీమాన్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళఅధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అజీజ్‌మీర్జా, నాయకులు పి.రామకృష్ణ, బి.విక్రం, కూరవెంకట్‌, రాహుల్‌రెడ్డి, సంపత్‌, అంకూస్‌, నసీం జహాన్‌, ఎం.డి. ముస్తాక్‌, దీపక్‌రెడ్డి, సారంగం, నల్లా సత్యనారాయణ, లలిత,, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:23:47+05:30 IST