సారు తీరే వేరు...

ABN , First Publish Date - 2022-11-30T00:47:49+05:30 IST

జిల్లాలోని ఓ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యా యుడి తీరు వివాదాస్పదంగా మారింది. తన సంతకాన్ని ఆయన అంగడి సరు కు చేశారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

సారు తీరే వేరు...

అంగడి సరుకుగా ఆయన సంతకం

డిప్యూటేషన్‌లో ఉన్న టీచర్‌కు జీతం ఇవ్వకుండా ఇబ్బందులు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలక గెజిటెడ్‌ సంతకానికీ వసూళ్లు

భూపాలపల్లిటౌన్‌, నవంబరు 29 : జిల్లాలోని ఓ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యా యుడి తీరు వివాదాస్పదంగా మారింది. తన సంతకాన్ని ఆయన అంగడి సరు కు చేశారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అవసరాన్నిబట్టి రేటు ను ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు... డీఈవో కార్యాలయంలో డిప్యూటే షన్‌పై పనిచేస్తున్న ఓ మహిళా టీచర్‌కు వేతనం చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం లోని ఓ స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు ఆ కాంప్లెక్స్‌ పరిధిలో 15 యూపీఎస్‌లు, పీఎస్‌ లు ఉన్నాయి. ఈ పాఠశాల లకు చెందిన ఉపాధ్యాయులను ఆయన తీవ్ర ఇబ్బం దులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన తీరును మం గళవారం పలువురు ఉపాధ్యాయులు భూపాల పల్లి డీఈవో కార్యాలయం వద్ద విలేకరులకు వివరించారు. ఎవరికి లీవ్‌లు కావాలన్నా, బ్యాంకుల నుంచి పర్సన ల్‌ లోన్లు తీసుకో వాలన్నా, డిప్యూటేషన్లు చేయించుకో వాలన్నా ముడుపులు ఇవ్వనిదే ఆయన తన సంతకం పెట్టరని తెలిపారు. ఆయన కాంప్లక్స్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యా యిని ఇటీవల జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి డిప్యూ టే షన్‌పై వచ్చారు. ఆమెకు సంబంధించిన వేతనాన్ని ఆ కాంప్లెక్స్‌ ప్రధానోపా ధ్యాయుడే చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సదరు మహిళా టీచర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అంతేకాకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పత్రాలపై గెజిటెడ్‌ సంతకం కోసం వచ్చిన లబ్ధిదారుల వద్ద కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొకరి నుంచి రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నట్టు పలువురు విమర్శిస్తున్నారు.

నా దృష్టికి రాలేదు...

- ముద్దమల్ల రాజేందర్‌, ఇన్‌చార్జి డీఈవో

గణపురం మండలంలోని కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడిపై నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. అలాగే డీఈవో కార్యాయానికి ఈనెల 24న డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయురాలికి ఆర్డర్‌ కాపీ ఇచ్చాం. కార్యాలయ అవసరాల కోసమే ఆమెను తీసుకున్నాం. ఆమె వేతనం కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడే చేయాల్సి ఉంది.

Updated Date - 2022-11-30T00:47:49+05:30 IST

Read more