వరంగల్‌ నూతన సీపీని కలిసిన కలెక్టర్లు

ABN , First Publish Date - 2022-12-06T00:08:33+05:30 IST

ఇటీవల వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్‌ను హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హనుమంతు, గోపి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రల సమస్య తలెత్తకుండా చూడాలని, ప్రజలు ప్రశాంతంగా పని చేసేందుకు పోలీసుశాఖ పని చేయాలని రంగనాథ్‌కు వారు వివరించారు.

వరంగల్‌ నూతన సీపీని కలిసిన కలెక్టర్లు
సీపీ రంగనాథ్‌కు పుష్పగుచ్చం అందిస్తున్న కలెక్టర్లు, కమిషనర్‌

హనుమకొండ క్రైం, డిసెంబరు 5: ఇటీవల వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్‌ను హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హనుమంతు, గోపి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రల సమస్య తలెత్తకుండా చూడాలని, ప్రజలు ప్రశాంతంగా పని చేసేందుకు పోలీసుశాఖ పని చేయాలని రంగనాథ్‌కు వారు వివరించారు. అలాగే నూతన సీపీని వివిధ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిశారు. పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీపీని కలిసిన వారిలో పాటు రెడ్‌క్రాస్‌ సొసైటీ వరంగల్‌ మెంబర్‌ ఈవీ శ్రీనివా్‌సరావు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఎస్పీ నాయకులు మంద శ్యాంసుందర్‌, జన్ను భరత్‌, పుష్పలత, లక్ష్మి, నీళిమ, జేరిపోతుల వంశీకృష్ణలు ఉన్నారు.

Updated Date - 2022-12-06T00:08:34+05:30 IST