మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు

ABN , First Publish Date - 2022-11-06T23:53:02+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయం.. బీజేపీకి చెంపపెట్టు అని, ఆ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ అన్నారు. ఆదివారం హనుమకొండలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయభాస్కర్‌ మాట్లాడారు. మునుగోడు ప్రజల తీర్పుతో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోయిందన్నారు.

మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు
అమరవీరుల జంక్షన్‌ వద్ద సంబరాల్లో పాల్గొన్న చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

విభజన చట్టంలోని హామీలు నెరవేర్చే వరకు పోరాడుతాం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సంబరాలు

హనుమకొండ టౌన్‌, నవంబరు 6: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయం.. బీజేపీకి చెంపపెట్టు అని, ఆ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ అన్నారు. ఆదివారం హనుమకొండలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయభాస్కర్‌ మాట్లాడారు. మునుగోడు ప్రజల తీర్పుతో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోయిందన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో దేశ ప్రజలు కేసీఆర్‌ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎ్‌సకు సద్దిమూట కట్టి బీజేపీకి గోరి కట్టారని ఆయన అన్నారు. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తామని వినయభాస్కర్‌ తెలిపారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగినవ్వమని ఆయన పేర్కొన్నారు.

వరంగల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ.. ఆత్మగౌరవానికి, అహంకారానికి జరిగిన పోరులో ఆత్మగౌరవం గెలిచిందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచారని తెలిపారు. ఈ విజయంతో టీఆర్‌ఎ్‌సకు రాష్ట్రంలో ఎదురు లేదని స్పష్టం అయిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రవి, సీపీఎం జిల్లా కన్వీనర్‌ చక్రపాణిలు మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్పుపెట్టి రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. ప్రధాని మోదీ ప్రజల ఆస్తులను అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి రాష్ట్రంలో చోటులేదన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో మాజీ ‘కుడా’’చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు జోరిక రమేశ్‌, పులి రజనీకాంత్‌, నయీమ్‌, యాకూబ్‌రెడ్డి, వామపక్ష పార్టీల నేతలు వలీ ఉల్లా ఖాద్రి, జ్యోతి, బిక్షపతి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబరాలు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించడంతో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకున్నారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేవారు. టీఆర్‌ఎ్‌సకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేవారు. వినయభాస్కర్‌ ఆద్వర్యంలో ర్యాలీగా వెలఙ్‌ళ అంబేద్కర్‌, జయశంకర్‌, కాళోజీ విగ్రహాలకు, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. నగరంలో ప్రతీ ప్రథౠ కూడలిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.

Updated Date - 2022-11-06T23:53:03+05:30 IST