అనఘాష్టమికి వేళాయే..
ABN , First Publish Date - 2022-12-16T00:24:34+05:30 IST
సమాజంలో శాంతి నెలకొల్పేందుకు, ప్రజలు ఈతిబాధలు లేకుండా సర్వ సుఖాలు పొందేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అనఘాష్టమి వ్రతాలు శుక్రవారం ఉదయం 9గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ వ్రతాలను నిర్వహించేందుకు దత్త పీఠాధిపతి సద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ గురువారం నగరానికి చేరుకున్నారు.ఆర్ట్స్ కళాశాల మైదానమంతా సర్వహంగులతో ముస్తాబైంది. వ్రతాలకు తరలి వచ్చే భక్తులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
పాల్గొననున్న సద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ
హనుమకొండ కల్చరల్, డిసెంబరు 15: సమాజంలో శాంతి నెలకొల్పేందుకు, ప్రజలు ఈతిబాధలు లేకుండా సర్వ సుఖాలు పొందేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అనఘాష్టమి వ్రతాలు శుక్రవారం ఉదయం 9గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ వ్రతాలను నిర్వహించేందుకు దత్త పీఠాధిపతి సద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ గురువారం నగరానికి చేరుకున్నారు.ఆర్ట్స్ కళాశాల మైదానమంతా సర్వహంగులతో ముస్తాబైంది. వ్రతాలకు తరలి వచ్చే భక్తులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను దత్త పీఠం ఉత్తరాధికారి విజయానందతీర్థస్వామి పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ సకల సుఖాలు, ఐశ్వర్యం సిద్ధించాలని జగద్గురు గణపతి సచ్చిదానందస్వామీజీ సంకల్పంతో ఈ వ్రతాలను నిర్వహిస్తున్నామన్నారు. మాఘ శుద్ధ అష్టమి శుక్రవారం కలిసి రావడంతో వ్రతాల వల్ల సత్ఫలితాలు ఉంటాయన్నారు. కులాలకు అతీతంగా వ్రతాలలో పాల్గొనవచ్చన్నారు.
అనఘాష్టమి వ్రతాలు ఈ నేలపై జరుగడం హనుమకొండ ప్రజల అదృష్టమని, దీంతో ఈ ప్రాంతమంతా పునీతమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యంవినయ్భాస్కర్ అన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వ్రతాల్లో పాల్గొనేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వై.వి.వామన్‌రావు, అర్జున్‌రావు, ప్రొఫెసర్ రవీందర్రావు తదితరులతోపాటు పీఠం నిర్వాహకులు కల్యాణ్శర్మ, దిలీ్పశర్మ, చక్రవర్తిశర్మ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
భగవద్గీత పారాయణం
శుక్రవారం ఉదయం అనాఘష్టమి వ్రతాల అనంతరం సాయంత్రం 5గంటలకు ఇదేవేదిక ద్వారా సామూహిక భగవద్గీత పారాయణం, శనివారం యువతీ, యువకుల తో ఆరోగ్య పరిరక్షణకై గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆ ధ్వర్యంలో క్రియా యోగా తరగతులు కూడా నిర్వహింపచేస్తామని, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దత్తవిజయానందస్వామి పిలుపునిచ్చారు.