ఘనంగా జడ్పీచైర్మన్‌ పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-08-18T05:20:00+05:30 IST

ఘనంగా జడ్పీచైర్మన్‌ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా జడ్పీచైర్మన్‌ పుట్టినరోజు వేడుకలు
శరత్‌చంద్రారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న వెంకటే్‌షగౌడ్‌, నాయకులు, తదితరులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 17 : జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు బుఽధవారం ఘనంగా జరిగాయి. మండల పరిధి ప్రతా్‌పసింగారంలోని ఆయన నివాసానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు వెళ్లి చైర్మన్‌ను పుష్పగుచ్ఛాలు  అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం కేక్‌కట్‌ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్‌ల సంఘం ఘట్‌కేసర్‌ మండలాఽధ్యక్షుడు ఓరుగంటి వెంకటే్‌షగౌడ్‌, సర్పంచ్‌లు కొంతం వెంకట్‌రెడ్డి, వంగూరి శివశంకర్‌, ఎంపీటీసీలు మలిపెద్ది వెంకట్రామిరెడ్డి, నీరుడి రామారావు, పోచారం మునిసిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగులపల్లి రమేష్‌, పన్నాల కొండల్‌రెడ్డి, కందుల కుమార్‌, సత్యనారాయణరెడ్డి, వేణు, భిక్షపతిగౌడ్‌, బొడిగే శ్రీనివా్‌సగౌడ్‌, కందుల రాజు, శ్రీకాంత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మాటూరి రవి, దుర్గరాజుగౌడ్‌, సాయిలు, శంకర్‌గౌడ్‌, రవి, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more