యువత స్వయం ఉపాధితో ఎదగాలి
ABN , First Publish Date - 2022-12-15T23:54:41+05:30 IST
యువత స్వయం ఉపాధితో ఎదగాలని కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి సూచించారు.
కేశంపేట, డిసెంబరు 15: యువత స్వయం ఉపాధితో ఎదగాలని కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి సూచించారు. పాపిరెడ్డిగూడ గ్రామంలో సందీప్, లక్ష్మయ్య అనే యువకులు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సెంటర్‌ను గురువారం జడ్పీటీసీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాండ్ర విష్ణువర్దన్ రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, ఫకిర గౌడ్, నర్సింలు, శివయ్య, నారాయణ, పర్వతాలు, జహంగీర్, సత్యం, రామస్వామి, చంద్రయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.