ప్రతీ పాఠశాలలో యోగా శిక్షణ

ABN , First Publish Date - 2022-12-16T23:07:47+05:30 IST

యోగా శిక్షణను ప్రతీ పాఠశాలలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. ఐదు రోజులుగా నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు.

 ప్రతీ పాఠశాలలో యోగా శిక్షణ
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో రేణుకాదేవి

డీఈవో రేణుకదేవి

వికారాబాద్‌, డిసెంబరు 16: యోగా శిక్షణను ప్రతీ పాఠశాలలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. ఐదు రోజులుగా నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు రోజూ ఐదు నిమిషాలు యోగా శిక్షణ ఇవ్వాలన్నారు. యోగాతో విద్యార్థుల శారీరక, మానసిక స్థితి మెరుగవుతుందని అన్నారు. జిల్లా అకడమిక్‌ అధికారి రవి మాట్లాడుతూ.. ఐదు రోజులు తీసుకున్న యోగా శిక్షణను ప్రతీ పాఠశాలలో అమలు చేసి విద్యార్థులకు రోజూ నేర్పాలన్నారు. యోగాను స్కూళ్లలో అమలు చేస్తేనే శిక్షణకు సార్థకత చేకూరుతుందన్నారు. శిక్షణకు సహకింరిచిన యోగా మాస్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అరుణ యోగా సంస్థ డైరెక్టర్‌ అరుణ పీఈటీల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా అధిగమించాలో వివరించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ అరుణ యోగా శిక్షణ సంస్త యోగా మాస్టర్లు అశోక్‌, శివ, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:08:04+05:30 IST