భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు

ABN , First Publish Date - 2022-10-03T05:44:15+05:30 IST

భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు

భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు
సరస్వతీదేవి అలంకరణలో కీసరగుట్ట భవానీమాత

  • కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

తాండూరు రూరల్‌/తాండూరు/పరిగి/ధారూరు/శామీర్‌పేట/కులకచర్ల/వికారాబాద్‌, అక్టోబరు 2: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు రోజుకో రూపంలో దుర్గామాతను కొలుస్తున్నారు. ఆదివారం సరస్వ తీమాత అలంకరణలో పూజలు చేశారు. వికారాబాద్‌, మే డ్చల్‌ జిల్లాల్లో దేవీమండపాల వద్ద పూజలు, కుంకుమార్చనలు చేస్తున్నారు. దేవీమాత విగ్రహాలను, ఆలయాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. తాండూరు మండలం అంతారం, తాండూరు పట్టణం తులసీనగర్‌ వరసిద్ధివినాయక ఆలయంలో మహిళలు కుంకుమార్చన, లలితా సహస్రనామం నిర్వహించా రు. పరిగిలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ పూజలుచేశారు. ధారూరులోని వీరభద్రేశ్వర ఆలయంలో, శామీర్‌పేటలోని గాయత్రీ మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ మూర్తి ఆధ్వర్య ంలో పూజలు జరుగుతున్నాయి. స్థానిక భక్తులతో పాటు హైదరాబాద్‌ నుంచి భక్తులు వచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అమ్మవారి మం డపాలను ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు. కులకచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండపై అమ్మవారు సరస్వతీదేవిగా దర్శణమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పరిధి ఆలంపల్లి అనంతపద్మనాభ స్వామికి గజవాహన సేవ నిర్వహించారు. అర్చకులు, భక్తులు విగ్రహానికి పూజలు నిర్వహించి ఆలంపల్లిలోని ఆలయ పురవీఽధుల్లో గజవాహనంపై ఊరేగించారు. 


  • దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే ఈటల

ఘట్‌కేసర్‌ రూరల్‌: ముస్లిం యువకుడు దుర్గామాత విగ్రహ ఏర్పాటకు విరాళ ఇవ్వటం మత సామరస్యానికి నిదర్శనమని బీజేపీ నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కొర్రెముల పంచాయతీ బాలాజీనగర్‌లో ప్రతిష్ఠించిన దుర్గామాతను ఆయన దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దుర్గామాత విగ్రహానికి ముస్లిం యువకుడు విరాళమివ్వడం స్నేహభావాన్ని తెలియజేస్తోందన్నారు. హిందూ-ముస్లింలు సోదర భావంతో మెలగాలన్నారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నరేష్‌, రామోజీ, కరుణాకర్‌, ప్రవీణ్‌, ప్రభంజన్‌, బాలు, దామోదర్‌రెడ్డి, రవి, సదానందరెడ్డి, మశ్చేందర్‌రెడ్డి, మల్లేష్‌, రాజిరెడ్డి, బస్వరాజ్‌గౌడ్‌, రమేష్‌, సురేష్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:44:15+05:30 IST