బషీరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ABN , First Publish Date - 2022-05-22T05:42:27+05:30 IST
బషీరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

బషీరాబాద్, మే 21: బషీరాబాద్ మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతానని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శ నివారం ఇందర్‌చెడ్, బషీరాబాద్, పర్ష్యానాయక్, తౌర్యానాయక్తండా, భోజ్యానాయక్, బాబునాయక్తండాలు, కొర్విచెడ్‌ఘని, మాసన్పల్లి, నీళ్లపల్లి, జలాల్పూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మండలంలోని ప్రతీ పల్లెను ప్రగతి బాట పట్టించాలనే లక్ష్యంతో పనులు చేయి స్తున్నట్టు చెప్పారు. తండాలకు తారు రోడ్లు వేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభత్వానికే దక్కిందన్నారు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. అంతకు ముందు గ్రామాల్లో మహిళలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎమ్మెల్యేను అడు గగా త్వరలో పేదలకు ఇళ్లు కట్టి స్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పి.వీరారెడ్డి, భీమప్ప, సునీత, శాంతి, టి.సువర్ణ ముకుంద్, వసంతమ్మ, లాలప్ప, దశరథ్, హన్మీబాయి, ఏఏంసీ చైర్మన్ రాజర త్నం, వైస్‌చైర్మన్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాము, లేడీ వింగ్ జయమ్మ, తన్వర్, ఇందర్‌చెడ్ రాజు, సునీల్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.