పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆదరణ

ABN , First Publish Date - 2022-11-30T23:56:05+05:30 IST

పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆదరణ ఉంటు ందని, యాచారం మండల టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పి.బాషా అన్నారు.

పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆదరణ
కందుకూరులో మాట్లాడుతున్న మన్నె జయేందర్‌

యాచారం/కొత్తూర్‌/కందుకూరు, నవంబరు 30: పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆదరణ ఉంటు ందని, యాచారం మండల టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పి.బాషా అన్నారు. బుధవారం మొండిగౌరెల్లి, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ నల్లానీరు వస్తోందన్నారు. పార్టీ బలోపేతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. పెంజ ర్లలో పల్లెపల్లెకూ టీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణ, దేశాల భీమయ్య, జైపాల్‌, దామోదర్‌రెడ్డి, సత్తయ్య, రాజు, రమేష్‌ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కందుకూరు మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జయేందర్‌ముదిరాజ్‌ కోరారు. సామ నర్సింహారెడ్డి ఫంక్షన్‌ హాల్లో కార్యకర్తలు సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పఽథకాలను ప్రజలకు వివరించేలా వంద మందికి ఒక్కరు చొప్పున కార్యకర్తలను, నాయకులను నియమిస్తామన్నారు. గ్రామాల్లో పార్టీ ఇన్‌చార్జిలను నియమించామన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, సాయిలు, ఉదయ్‌కుమార్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:56:05+05:30 IST

Read more