మహిళలు ఆర్థికంగా రాణించాలి

ABN , First Publish Date - 2022-08-17T05:52:11+05:30 IST

మహిళలు ఆర్థికంగా రాణించాలి

మహిళలు ఆర్థికంగా రాణించాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 16 : మహిళలు ఆర్థికంగా రాణించినప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌(టీజీబీ) అవుషాపూర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం అవుషాపూర్‌లో డ్వాక్రా మహిళలకు ఆర్థిక అక్ష్యరాస్యతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా రాణించాలని, డ్వాక్రా మహిళలకు టీజీబీలో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బ్యాంక్‌ సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Read more