నోవాటెల్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

ABN , First Publish Date - 2022-03-06T04:25:40+05:30 IST

నోవాటెల్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

నోవాటెల్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మహిళలు

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నోవాటెల్‌ హోటల్‌లో శనివారం మహావీర్‌ మెర్సిడెస్‌, ఆర్ట్‌హౌ్‌సతో కలిసి శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి సంబురాలు జరిపారు. బ్రేక్‌ ద బయా్‌సను ప్రదర్శించారు. హైదరాబాద్‌లో అత్యంత సృజనశీలులైన మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నోవాటెల్‌ మేనేజర్‌ రూబిన్‌ చెరియన్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో మహిళలకు తిరుగులేని శక్తి ఉందన్నారు. ఇప్పటికే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయ, క్రీడ, వివిధ ఉన్నతమైన హోదాల్లో మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. నారీమణుల శక్తి చాలా గొప్పదని కీర్తించారు.  కులమత, జాతీ భేదాలు లేకుండా అన్నివర్గాల పండగలను అకట్టుకునే విధంగా నోవాటెల్‌ హైదరాబాద్‌ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఎన్నోకార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు పలు ప్రదర్శనలు చేశారు.

Read more