బాధితులకు అండగా..
ABN , First Publish Date - 2022-10-18T05:25:28+05:30 IST
బాధితులకు అండగా..
కడ్తాల్/ఆమనగల్లు, అక్టోబరు 17: కొండ్రిగాని బోడు తండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గిరిజన నేత కొర్ర లక్యనాయక్ మృతి చెందగా ఆయన భౌతికకాయాన్ని సోమవారం డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నేనావత్ బీక్యనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు యాట నర్సింహలు సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సేవ్య బావోజీ, కాంగ్రెస్ నాయకులు రాంచందర్ నాయక్, సత్యంయాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా లక్య కుటుంబాన్ని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ పరామర్శించి రూ.5వేలు అందజేశారు. ఆయన వెంట నాయకులు బీచ్యనాయక్, శ్రీనునాయక్, లాయక్ అలీ, వరలక్ష్మి, గణేశ్, రాజు, ఈశ్వర్, నరేశ్ ఉన్నారు. అదేవిధంగా కమల్ నగర్‌కాలనీకి చెందిన శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని సోమవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్‌సభ్యుడు నాగిళ్ల జగన్ పరామర్శించి ట్రస్టు ద్వారా రూ.3వేలు అందజేశారు. ఆయన వెంట నాయకులు వెంకట్, దాదయ్య, హరీశ్, గణేశ్, సాయి, మహేశ్ ఉన్నారు.