భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-11-15T23:28:13+05:30 IST

బీరులో పురుగుల మందు కలిపి భర్తను హతమార్చిన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

 భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న సీఐ నవీన్‌ కుమార్‌, పోలీసుల అదుపులో నిందితులు

షాద్‌నగర్‌ రూరల్‌, నవంబరు 15: బీరులో పురుగుల మందు కలిపి భర్తను హతమార్చిన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. షాద్‌నగర్‌ పీఎ్‌సలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిల్కమర్రి శివారులోని కోళ్లఫారంలో పనిచేసే రామస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అనిత భర్త అడ్డుగా ఉన్నాడని 15రోజుల కిందట ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు పన్నాగం పన్నింది. అందులో భాగంగా పురుగుల మందు కొనుగోలు చేసి కమ్మదనం శివారులో రామస్వామి రవికి బీరులో పురుగుల మందు కలిపి తాగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న రామస్వామిని కమ్మదనం గ్రామస్థులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆసుసత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి విష పదార్థం తాగినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఈనెల 7న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బీరులో పురుగుల మందు కలిపినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితులు అనిత, ఆమె ప్రియుడు రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ సమావేశంలో సీఐ వెంట ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-15T23:28:13+05:30 IST

Read more