కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడిస్తారు?

కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడిస్తారు?
సమావేశంలో మాట్లాడుతున్న వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్‌అర్బన్‌, మార్చి 5: కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పాలని షాద్‌నగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ పంపుతున్నట్లు తెలిపారు. షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు, అర్హత కల్గిన వితంతువు, వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు గీతా, చేనేత కార్మికులకు సైతం పింఛన్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే 2018జూన్‌ నుంచి కొత్తవారికి పింఛన్లు ఇవ్వడం లేదని, కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. దీనివల్ల నిరుపేద వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు రాక రోడ్లపైకి వచ్చి బిక్షాటన చేస్తున్నారని వాపోయారు. సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శమంటున్న ముఖ్యమంత్రి నాలుగేళ్ళుగా ఒక్క కొత్త పింఛను కూడాఇవ్వని ప్రభుత్వం ఆదర్శం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని వీర్లపల్లి శంకర్‌ డిమాండ్‌ చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాబర్‌ఖాన్‌, జి.బాల్‌రాజ్‌గౌడ్‌, ఎస్‌. రాజు, రఘునాయక్‌, కొమ్ము కృష్ణ, కదీర్‌, గుట్ట రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST